సాగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ సిద్దం.


రేపు నిర్వహించే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్దం అయింది..నల్లగొండ జిల్లా కేంద్రంలోని వేర్ హౌసింగ్ కార్పోరేషన్ గౌడన్స్ లో కౌంటింగ్ కు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు… రెండు హాల్స్ లలో 14 టేబుల్స్ ఏర్పాటు చేసి ఓట్లను లెక్కించనున్నారు…..మెత్తం 25 రౌండ్స్ లలో కౌంటింగ్ పూర్తి కానుంది…..ఎన్నికల సంఘం గైడ్లెన్స్ ప్రకారం కోవిడ్ నిభంధనల్ని కఠినంగా లు చేస్తున్నరు …. కోవిడ్ టెస్ట్ లో నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన వారిని మాత్రమే కౌంటింగ్ హాల్స్ లోకి అనుమతి ఇస్తున్నారు….. అథరైజ్డ్ పాసులు ఉన్న వారికి, సిబ్బందికి, అభ్యర్దులకు, ఏజెంట్లకు కోవిడ్ టెస్ట్ లు నిర్వహించారు… నెగిటివ్ వచ్చిన వారికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు…. ఏజెంట్లకు పీపీఈ కిట్లు కూడా అందజేస్తున్నరు….. కౌంటింగ్ కేంద్రాన్ని మెత్తం ప్రతి మూడు గంటలకు ఒక సారి శానిటైజ్ చేస్తున్నరు…..ప్రతి ఒక్కరికి మాస్క్ లు తప్పనిసరి చేశారు…రేపు ఉదయం 7 గంటలకు అభ్యర్దులు, కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూం ఒపెన్ చేసి ఈవీఎం లను కౌంటింగ్ హాల్స్ తరలిస్తారు..,ముందుగా పోస్టల్ బ్యాలట్ ఒట్లను లెక్కించి సరిగ్గా 8 గంటలకు ఈవీఎం ఓట్లను లెక్కించనున్నారు……. ఇందు కోసం మెత్తం 2 హాల్స్ లలో 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు… 25 రౌండ్స్ లు లెక్కించనున్నారు…..ప్రతి టేబుల్ కు ఒక కౌంటింగ్ సుపర్ వైజర్ , అసిస్టెంట్ సుపర్ వైజర్ తో పాటు మరో ముగ్గురు సిబ్బందిని నియమించారు…మెత్తం 400 మంది సిబ్బంది ఈ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు…వీరికి మూడు దఫాలుగా శిక్షణ కూడా ఇచ్చారు…. ఈ రోజు మాక్ కౌంటింగ్ ను విజయవంతంగా నిర్వహించారు…ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరక్కుండా పారదర్శకంగా కౌంటింగ్ నిర్వహించేందుకు పకడ్భందీగా ఏర్పాట్లు చేశారు… కేంద్రం నుంచి వచ్చిన ఎన్నికల పరిశీలకుడు సజ్జన్ సింగ్ చవాన్ , కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆర్ ఓ రోహిత్ సింగ్ .ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, నోడల్ అధికారి రాజ్ కుమార్ లు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షణ చేస్తున్నారు….. 300 మంది పోలీసులను భద్రత కోసం ఉపయోగిస్తున్నారు… మూడంచెల భద్రత వ్యవస్దను ఏర్పాటు చేశారు….144 సెక్షన్ అమలు చేశారు… ఎన్నికల సంఘం ఆదేశించిన విధంగా పార్టీలు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, సంబరాలు నిర్వహించకుండా ప్రజలు గుమికూడకుండా పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు…… కౌంటింగ్ సందర్భంగా కార్యకర్తలు ప్రజలు ఎవ్వరు తండోప తండోలుగా గుంపులు గుంపులు గా కౌంటింగ్ కేంద్రం వద్దకు రావొద్దని పోలీసులు ఆంక్షలు విధించారు……. ఏప్రిల్ 17 నాడు నిర్వహించిన సాగర్ ఉప ఎన్నికల్లో 86.8 శాతం పోలింగ్ నమోదు అయింది……346 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగింది…41 మంది అభ్యర్దులు పోటి చేశారు…….. ఇక ఈవీఎం లను భద్రపరిచిన స్ట్రాంగ్ రూం ల వద్ద కేంద్ర బలగాలతో , 40 సీసీ కెమెరాలతో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు………. నోముల నర్సింహయ్య హఠన్మరణంతో జరిగిన ఈ ఉప ఎన్నికల్లో విజయం ఎవ్వరిని వరిస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెల్కొంది…

– Prakash Chitram.

Related posts

Leave a Comment