నల్లగొండ: నేడు నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు… పురపాలక శాఖామాత్యులు కల్వకుంట్ల తారక రామారావు గారిని విద్యుత్ శాఖామాత్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారితో కలిసి.. నల్లగొండ నియోజకవర్గంలో లోని,సమస్యల పరిష్కారం కొరకు అభ్యర్థించడం… ఇందుకు వారు సానుకూలంగా స్పందించడం జరిగింది

ప్రభుత్యం కోదండరాం కు బేషరతుగా క్షమాపణ చెప్పాలి: పన్నాల

నల్లగొండ: కేంద్ర ప్రభుత్యం తెచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలను, నూతన విద్యుత్ సవరణ బిల్లు రద్దు చేయాలని చేపట్టిన భారత్ బంద్ అన్నీ రాష్టాలలో శాంతియుతంగా జరిగితే తెలంగాణా లో కెసిఆర్ కేంద్ర ప్రభుత్యానికి అనికూలంగా ప్రజాస్వామ్య హక్కులను కాదని బంద్  నిర్యాహిస్తున్న  నాయకులను అణచివేతకు గురిచేస్తూ అరెస్టులు చేశారని తెలంగాణ జన సమితి జిల్లా అద్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి అన్నారు. నిన్నటి ప్రొ.కోదండరాం అరెస్టును ఖండిస్తూ అఖిలపక్ష కమిటీ సబ్యులంతా  తెలంగాణ జన సమితి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారత్ బంద్ లో బాగంగా హయత్ నగర్ బస్సు డిపో ముందు నిరసన తెలుపుటకు వచ్చిన తెలంగాణ జన సమితి వ్యవస్థాపక  అద్యక్షులు ఆచార్య ప్రొ.కోదండరాం పై పోలీసులు అనుచితంగా ప్రవర్తించి కారునుండి దిగకముందే కారునుండి లాగి బలప్రయోగం చేయడం…

బెస్ట్ అవేలబుల్ స్కీం డ్రా

నల్లగొండ జిల్లాలో చదువుకొనుచున్న ఎస్సీ విద్యార్ధిని /విద్యార్ధుల కొరకు 2021 – 22 విద్యా సంవత్సరమునకు బెస్ట్ అవేలబుల్ స్కీం క్రింద ఇంగ్లీష్ మీడియం 1వ,తరగతి (డేస్కాలర్) మరియు 5వ తరగతి (రెసిడెన్సీయల్) కొరకు దరఖాస్తులు స్వీకరించడం జరిగింది, దీనికి సంబంధించిన  ఎంపిక డ్రా 14 వ తేదీన ఉదయ్ ఆదిత్య భవనము నల్లగొండ నందు ఉదయము 11:00 గంటలకు డ్రా తీయబడును.

ఈ నెల 18 న గురుకుల ప్రవేశ పరీక్ష

తెలంగాణ బీసీ,ఎస్సీ, ఎస్టీ జనరల్ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం ఈ నెల 18 న (TG – CET) నిర్వహిస్తున్నారు,12 వ తేదీ నుండి హాల్ టికెట్లు TG – CET GURUKULA ప్రభుత్య వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు. ఈ పరీక్ష 18 వ తేదీ ఆదివారము ఉ : 11.00 నుండి 01:00 వరకు ఉంటుంది. హాల్ టికెట్ ఈ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు. DOWNLOAD Link : https://tgcet.cgg.gov.in/TSVTGCETAPPLSPR/ht/searchHTtgVcet21 Model Question Paper – TGCET-2021

కరోనా థ‌ర్డ్ వేవ్ పిల్ల‌ల‌పై ప్ర‌భావం చూపుతుంద‌న‌డానికి ఎలాంటి ఆధారాలు లేవు..

క‌రోనా రెండో వేవ్ ముగియ‌క ముందే.. మూడో వేవ్ వ‌స్తోంద‌ని, అది పిల్ల‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూప‌బోతోంద‌న్న వార్త‌లు త‌ల్లిదండ్రుల‌కు నిద్ర లేకుండా చేస్తున్నాయి. అయితే వాళ్ల ఆందోళ‌న‌కు తెర‌దించే ప్ర‌య‌త్నం చేశారు కొవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ వీకే పాల్‌. థ‌ర్డ్ వేవ్ పిల్ల‌ల‌పై ప్ర‌భావం చూపుతుంద‌న‌డానికి ఎలాంటి ఆధారాలు లేవ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇండియా టుడే టీవీతో ఆయన మాట్లాడారు. ప్ర‌త్యేకంగా పిల్ల‌ల‌పైనే ప్ర‌భావం చూపే వేవ్ ఉంటుంద‌న్న‌దానిపై స్ప‌ష్ట‌త లేదు. ఇప్ప‌టి వ‌ర‌కూ క‌రోనా అటు పెద్ద‌లు, ఇటు పిల్ల‌ల‌పై ఒకే ర‌క‌మైన ప్ర‌భావం చూపింది అని వీకే పాల్ తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖ విడుద‌ల చేసిన సెరోప్రివ‌లెన్స్ డేటా ఇదే స్ప‌ష్టం చేస్తోంది. వ్య‌క్తుల బ్ల‌డ్ సీరంలో ఉండే వ్యాధి కార‌కాల స్థాయిని తెలిపేదే ఈ సెరోప్రివ‌లెన్స్‌. ఇది పెద్ద‌లు,…

రేపే POCO M3 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్

కొద్ది రోజుల క్రితం గ్లోబల్ మార్కెట్‌లో పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. షావోమీ, రియల్‌మీ, ఒప్పో, వివో లాంటి కంపెనీలకు పోటీగా తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది పోకో. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ఇండియాకు ఎప్పుడు వస్తుందా అని పోకో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. జూన్ 8న ఇండియాలో పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కానుంది. POCO M3 Pro 5G Smart Phone Features: Storage & RAM 4GB+64GB, 6GB+128GB Dimensions Height: 161.81mmWidth: 75.34mmThickness: 8.92mmWeight: 190g Display6.5″ FHD+ Dot Display Resolution: 2400 x 1080Contrast ratio: 1500:1Refresh rate: 90HzDynamicSwitch display: 30Hz/50Hz/60Hz/90HzReading mode 3.0360° ambient light sensors ProcessorMediaTek Dimensity 700CPU: Arm Cortex-A76 ,7nm…

గులాబీ గూటికి టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ?

తెలంగాణలో టీడీపీకి మరో భారీ షాక్ తగలనుంది.. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ  టీఆర్ఎస్‌లో చేరేందుకు మార్గం సుగుమం అయ్యింది.. ఎమ్మెల్సీ పదవిపై హామీ లభించడంతో ఎల్‌.రమణ టీఆర్ఎస్‌ పార్టీలో చేరేందుకు దాదాపు రంగం సిద్ధమైంది.  ఈ వారంలోనే ఎల్‌.రమణ టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశాలు కనబడుతున్నాయి. టీటీడీపీ అధ్యక్షుడుగా ఉన్న ఎల్‌.రమణ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న పా​ర్టీ నేతలు గత సెప్టెంబర్‌లో తిరుగుబాటుకు దిగారు. తెలంగాణ పార్టీ నాయకత్వ మార్పు కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. గత ఏడేళ్లుగా ఒకే వ్యక్తి అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారని, రాష్ట్రంలో పార్టీ ఉనికి ఆందోళనలో పడిందని, ఇప్పటికైనా అధ్యక్షుడిని మార్చాలంటూ వారు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రమణ సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. 

ఐకెపి సెంటర్ సందర్శించిన తెలంగాణ జన సమితి నాయకులు

నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం లోని కురుమర్తి గ్రామములో ఉన్న ఐకెపి సెంటర్ ను తెలంగాణ జన సమితి నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మారబోయిన శ్రీధర్ మరియు ఇతరులు సందర్శించారు. రైతులు ధాన్యము తీసుకువచ్చి రెండు నెలలు అవుతున్నప్పటికీ ఇంకా పూర్తిగా కొనుగోలు చేయలేదని ఇప్పటికే రెండు మూడు సార్లు వర్షం పడి ధాన్యపు గింజలు తడిసి మొలకెత్తుతున్న వి అని రైతులు ఆవేదన వెలిబుచ్చారు ప్రభుత్వం తక్షణమే స్పందించి కొనుగోలు చేయాలని తెలంగాణ జన సమితి జిల్లా కమిటీ జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేయడం జరిగింది. రైతులు ఆత్మహత్యకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలి అని జిల్లా అధ్యక్షుడు గోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

జూన్ 8 న కేబినెట్ సమావేశం

రాష్ట్ర కేబినెట్ సమావేశం, జూన్ 8 న మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు, ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరుగనున్నది. రాష్ట్రంలో వైద్యం, కరోనా స్థితిగతులు, ఇరిగేషన్, రైతుబంధు, వ్యవసాయం పనులు, లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అనే అంశాల మీద కేబినెట్ చర్చించే అవకాశమున్నది. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలో భాగంగా, ప్రాజెక్టుల పనుల పురోగతి, చేపట్టవలసిన చర్యలు, వానాకాలం సాగునీరు, తదితర సంబంధిత అంశాల మీద సమీక్ష జరిగే అవకాశమున్నది. వానాకాలం పంటల సాగు పనులు ప్రారంభమైన నేపథ్యంలో, పంట పెట్టుబడి సాయం రైతుబంధు అందుతున్న విషయం పై, కల్తీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు, ఎరువులు క్రిమిసంహారక మందుల లభ్యత, తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశమున్నది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పటిష్ట…

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో మాదకద్రవ్యాలు పట్టివేత

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో భారీగా మాదకద్రవ్యాలు పట్టివేత. దోహ నుండి హైదరాబాద్ వచ్చిన ఓ లేడి ప్యాసింజర్ వద్ద 53 కోట్ల విలువ చేసే హెరాయిన్ గుర్తించిన డీఆర్ఐ అధికారులు. ఈస్ట్ ఆఫ్రికా జాంబియా నుండి భారీ మొత్తం లో మత్తు పదార్ధాలు హైదరాబాద్ కు ఎక్స్ పోర్ట్ అవుతున్నాయనే పక్కా సమాచారం తో శంషాబాద్ లో మాటు వేసిన డీఆర్ఐ అధికారులు. అనుమానం వచ్చి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ లో అడ్డగించిన అధికారుల బృందం. తమదైన స్టైల్‌ లో  విచారణ చేయగా బయట పడ్డ డ్రగ్స్‌ సరఫరా గుట్టు. నిందితురాలు ముకుంబా కరోల్ ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్న డీఆర్ఐ అధికారులు.