“NALGONDA DIARY” బిజినెస్ డైరెక్టరీ ఆవిష్కరణ

సంక్రాంత్రి పర్వదినము పురస్కరించుకొని “NALGONDA DIARY” బిజినెస్ డైరెక్టరీ ని MLA కంచర్ల భూపాల్ రెడ్డి గారి చేతులమీదుగా ఆవిష్కరింపజేశారు. వారు “NALGONDA DIARY” బిజినెస్ డైరెక్టరీ గురించి ఈ సందర్బంగా మాట్లాడుతూ అన్నీ రకాల ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఫోన్ నెంబర్లు.పూర్తి అడ్రస్  ఒకచోట చేర్చి “NALGONDA DIARY” బిజినెస్ డైరెక్టరీ  రూపొందించారని దీని వలన నల్లగొండ జిల్లాలోని ఎమర్జెన్సీ సేవలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల సమగ్ర సమాచారం (ఫోన్ నెంబర్లు, అడ్రస్) వినియోగదారులకు అందించబడుతుందన్నారు.  గ్రామంలోని సర్పంచ్ ,MPTC, VRO, VRA, నుండి మండల మరియు జిల్లా స్థాయి అధికారుల సమాచారంతో పాటు విద్య, వైద్య, వాణిజ్య సంబందమైన వస్తు సేవలు లభించే ప్రాంత మరియు వ్యక్తుల సమాచారం “NALGONDA DIARY” లో పొందుపరిచారని. అన్నీ రకాల వర్తక వ్యాపారులందరూ  తమ సమాచారాన్ని పొందుపరచుకొని ప్రచారం చేసుకోవచ్చని అన్నారు. ఈ  కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మెన్ బొర్ర సుధాకర్, రావుల శ్రీనివాస్ రెడ్డి, యుగెంధర్ రెడ్డి, కవి, రచయిత అంబటి వెంకన్న, చిత్రం ప్రకాష్,రఫీ, వంకెపాక యాదగిరి, దోరేపెల్లి వెంకన్న, సాయి ప్రియ  తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment