చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ పున ప్రారంభం

నల్గొండ : ఎంతో మంది జాతీయ స్థాయి మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్థాయి క్రీడాకారులకు పుట్టినిల్లయిన చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ covid 19 వల్ల  దాదాపు 9 నెలలు క్రీడా కార్యక్రమాలు నిలిపివేసి…. నేటి ఉదయం కబడ్డీ గ్రౌండ్ పూజా కార్యక్రమం తో పున ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నల్గొండ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శంభులింగం పాల్గొని మాట్లాడుతూ కబడ్డీ క్లబ్ పున ప్రారంభం కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో హరి… క్లబ్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు.. మధుసూదన్ రెడ్డి…బైరు రాజశేఖర్.. రవితేజ మరియు వాలీబాల్ అథ్లెటిక్ క్రీడాకారులు  పాల్గొన్నారు.

Related posts

Leave a Comment