త్రాగి వాహనాలను నడపకండి

నల్లగొండ రూరల్  ప్రజలకు పోలీస్ వారి ముఖ్య సూచన:..

Accident and incident Free Day

1.ఈ నెల డిసెంబర్ 31వ తేదీన రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు పోలీసుల అద్వర్యం లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహించబడును.

2. 4 పోలీసు టీమ్లు స్థానిక మరియు సంచార టీమ్లుగా ఏర్పడి ప్రత్యేకంగా  డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహించబడును.పరీక్షించు సమయంలో వీడియో రికార్డు చేయబడును.

3.  డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహిస్తున్న సమయంలో పట్టుబడ్డ వ్యక్తుల వాహనాలు స్వాధినం

చేసుకోబడును.ఆ  రోజు ప్రయణించువారు పై విషయాన్ని గమనించగలరు.

4.   డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహించు సమయంలో పట్టుబడిన వ్యక్తుల సమాచారం ఆధార్ నంబరుతో జతపరచడం జరుగును.ఆ సమాచారం ఉద్యోగం మరియు వీసా మరియు పాస్పోర్ట్ ఇంకా మిగతావి జారీచేయు సమయంలో పరిగణనలోకి తీసుకోబడుతుంది. కావున  ఈ విషయాన్ని అందరు గమనించగలరు.

5.డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి 3 నుండి 7 రోజుల వరకు జైలు  శిక్ష విధించ వచ్చు.

6. కావున ప్రజలు త్రాగి వాహనాలను నడపకుండా పోలీసులకు సహకరించాలి.

ప్రజల అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు…. 💐💐

అందరూ బాగుండాలి అందులో మనముండాలి

ఏ. రాజశేఖర్ రెడ్డి

ఎస్. ఐ. ఎఫ్ పోలీస్

నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్

Related posts

Leave a Comment