పెద్దగట్టు లో బాలుడు మృతి

నల్గొండ జిల్లా పీ.ఏ పల్లి మండలం పెద్దగట్టు గ్రామంలో పాముకాటుతో బాలుడు ధనుష్(4)మృతి చెందడం తీవ్రంగా కలిచివేసింది.గ్రామానికి చెందిన కోనేటి శేఖర్, పార్వతమ్మ దంపతుల కుమారుడు ధనుష్ ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని,నాగు పాము కాటు వేసింది. ఆదివారం పాముకాటుకు గురైన ధనుష్ నోట్లో నుంచి నురగలు రావడంతో వెంటనే గమనించిన తల్లి తండ్రులు చికిత్స నిమిత్తం సాగర్ ప్రభుత్వ ఏరియా దవాఖానకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు…

ఆరోగ్యంగా ఉంటే అన్నీ సాద్యమే- కంచర్ల

నల్లగొండ : ఆరోగ్యంగా ఉంటేనే  అన్నీ సాదించవచ్చని, జీవితంలో అనుకున్నది సాదించాలంటే శారీరక, మానసిక, ఆరోగ్యం ముఖ్యమని నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు,  నల్లగొండ పట్టణంలోని ప్రకాశం బజార్లో గల బాలాజి కాంప్లెక్స్ 4వ అంతస్తులో విన్నర్ వరల్డ్ తైక్వాండో, మిక్సీడ్ మార్షల్ ఆర్ట్స్ & ఫిట్ నెస్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఅంతర్జాతీయ, అత్యంత ఆదునిక పరికరాలతో ప్రాక్టీస్ చేయడం వల్ల రాష్ట్ర, జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో ఫలితాలు రాగలవన్నారు,        తెలంగాణ తైక్వాండో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి A.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి పరికరాలను ఈ సెంటర్లో ఉపయోగిస్తున్నామని, తెలంగాణలో అతిపెద్ద అకాడమీగా విన్నర్ వరల్డ్ తైక్వాండో అకాడమీ నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి MD మక్బూల్ అహ్మద్,…

పదవీ విరమణ అనంతరం సమాజ సేవలో నిమగ్నం అవ్వాలి-ఎమ్మెల్యే భాస్కరరావు

ప్రభుత్వ ఉద్యోగులు తాము చేసిన సర్వీసు పూర్తి అయిన అనంతరం సమాజ సేవలో నిమగ్నం అవ్వాలని మిర్యాల శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు అన్నారు.ఆదివారం రాత్రి స్థానిక లక్ష్మీ కళ్యాణ మండపంలో బంజారా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన మిర్యాలగూడ రూరల్ ఏ ఎస్ఐ దశరథ రాజు పదవి విరమణ వీడ్కోలు సమావేశం లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.విధినిర్వహణలో బాధ్యతాయుతంగా పని చేయడంతో పాటు నేరాలను అదుపు చేయడంలో దశరథ రాజు విశేష కృషి చేశారన్నారు.ఎంతటి కేసునైనను సులువుగా ఛేదించగల సామర్థ్యం ఆయనకు ఉందన్నారు.ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడంతో పాటు నేరాలు అదుపు చేయడంలోనూ వారి కృషి మరువలేనిదన్నారు.మిర్యాలగూడ రూరల్ సిఐ రమేష్ బాబు మాట్లాడుతూ పలు దొంగతనాల కేసులు హత్య కేసులను చేదించే విషయంలో దశరథ రాజు పాత్ర విశేషమన్నారు.భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు…

శాంతిభద్రతలను పరిరక్షించేది పోలీసు వ్యవస్థ -కంచర్ల భూపాల్ రెడ్డి

మారుతున్న కాలానికి అనుగుణంగా శాంతిభద్రతల సమస్యలు.. నేరాలు, అదుపు చేయటానికి, చురుకైన తెలివైన పోలీసు వ్యవస్థ అవసరమని. ఇందుకు రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను పటిష్ట పరిచిందని, దేశంలోనే రాష్ట్ర పోలీసు వ్యవస్థకు ప్రముఖ స్థానం ఉందని. మీరు కూడా పోలీస్ ఉద్యోగంలో సెలెక్ట్ అయి రాష్ట్రానికి సేవలందించాలని కోరుకుంటున్నానని, ఈ సెంటర్లో బాగా కష్టపడి చదువుకుని పోలీస్ గా సెలెక్ట్ అయిన వారికి తాను 50 వేల రూపాయల ప్రోత్సాహ బహుమతి అందిస్తానని., నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు అన్నారు. ఇంటర్ బోర్డు విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లో నిర్వహించిన పోలీసు సెలక్షన్ ట్రైనింగ్ సెంటర్ ముగింపు సమావేశంలో మాట్లాడుతూ అన్నారు.ఈ సందర్భంగా తాను స్పాన్సర్ చేసి, ట్రైనింగ్ లో శిక్షణ పొందిన వారికి ఉచితంగా స్టడీ మెటీరియల్…

క్షతగాత్రులకు రూ.10,000 ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే రవీంద్ర కుమార్

పి.ఏ. పల్లి: హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వారికి ఖర్చులు ప్రభుత్వం అందిస్తుందిక్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ క్షతగాత్రులకు దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ వ్యక్తిగతంగా రూ.10,000 ఆర్థిక సహాయం అందించారు.ఆదివారం హైదరాబాద్ ఆసుపత్రిలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శించారు. నవీన హాస్పిటల్ లో 7గురు,మోహన్ హాస్పిటల్ లో ఒకరు,హెల్త్ కేర్ హాస్పిటల్ లో ఒక్కరు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు అయే ఖర్చు మొత్తం ప్రభుత్వం అందిస్తుంది అని ఆయన తెలిపారు. ఎంపీపీ జాన్ యాదవ్ 5000 ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఆయన వెంట ఎంపీపీ జాన్ యాదవ్,సర్పంచ్ మల్లేష్,ప్రశాంత్ రావు తదితరులు పాల్గొన్నారు. సేకరణ: విజయ్ కుమార్, పి.ఏ. పల్లి

అభివృద్ధి ని చూసి టి.ఆర్.ఎస్ లో చేరికలు : మాజీ జడ్పీటీసీ తేర గోవర్ధన్ రెడ్డి.

పి.ఏ. పల్లి: ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టి.ఆర్.ఎస్ పార్టీ లో చేరుతున్నారన్నారని పి.ఏ.పల్లి మండల మాజీ జడ్పీటీసీ తేర గోవర్ధన్ రెడ్డి అన్నారు పి.ఏ.పల్లి మండలంలోని పోల్కంపల్లి గ్రామానికి చెందిన ఏం.ఆర్.పి.ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఏలేటి నర్సింహ మాజీ జడ్పీటీసీ తేర గోవర్ధన్ రెడ్డి సమక్షంలో టి ఆర్ ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ తేర గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టి.ఆర్.ఎస్ పార్టీ లో చేరుతున్నారన్నారు.అదేవిధంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల పార్టీ అధ్యక్షుడు, పి.ఏ.సి.ఎస్ చైర్మన్ ఎల్గురి వల్లప్ రెడ్డి, దేవరకొండ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎర్ర యాదగిరి, టి.ఆర్.ఎస్ నాయకులు రమణంపల్లి వెంకటయ్య,దోసపాటి సాలయ్య,చిలుముల అనిల్, మద్దిమడుగు…

పురాతన ఆలయాల అభివృద్ధికి కృషి-కంచర్ల

నల్లగొండ : పురాతన ఆలయాలను వెనుక బాటుకు గురైన పాతబస్తీ అభివృద్ధికి కృషి చేస్తానని నల్లగొండ పట్టణం షేర్ బంగ్లా లోని అసంపూర్తిగా ఉన్న శ్రీ భక్తాంజనేయ సహిత సంతోషిమాత దేవాలయం నిర్మాణాన్ని పూర్తి చేయుటకు తన వంతు సహాయ సహకారలందిస్తానని నల్లగొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. నేడు శ్రీ భక్తాంజనేయ సహిత సంతోషిమాత దేవాలయ పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరై చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన లకడాపురం వెంకన్న మరియు పాలక మండలి సభ్యులు (ధర్మకర్తలు) గా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ కాసర్ల జ్యోతి, వయల నాగరాజు , నల్లబోతు వెంకన్నగ ఎర్ర సౌజన్య లకు శుభాకాంక్షలు తెలియ జేసినారు, ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ పురాతన ఆలయాలను వెనుక బాటుకు గురైన…

గీత కార్మికుల కు నెలకు పదివేల పింఛన్ ఇవ్వాలని-కొండ వెంకన్న

ప్రతి గీత కార్మికుల కి నెలకు పదివేల పింఛన్ ఇవ్వాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న అన్నారు, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం 20 21 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ధర్మేష్ పురం గ్రామం లో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు జిమ్ కుంట్ల లింగయ్య గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా కొండ వెంకన్న మాట్లాడుతూ గీత కార్మికులకు సొసైటీలను లైసెన్స్ లను గ్రూపులో ఉన్న వారికి రుణాలు ఇవ్వాలని గీత కార్మికుల ప్రతి గీత కార్మికుల ప్రతి గీత కార్మికుల కి నెలకు పదివేల పింఛన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు పాలకూరి సైదులు కృష్ణయ్య రాములు వెంకన్న ఉపసర్పంచ్ అంజయ్య పాలకుర్తి పాలకుర్తి పాలకుర్తి ప్రభాకర్ జిమ్ కుంట్ల…

ఓటమి విజయానికి నాంది

పి.ఏ. పల్లి: అంగడిపేట స్టేజీ నందు సంక్రాంతి పండుగ సందర్భంగా యువరాజ్ వారియర్స్ యూత్ అద్వర్యం లో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో ఈ రోజూ నిర్వహించిన ఫైనల్ మ్యాచ్ బాలాజీ నగర్ జట్టు విజయఢంకా మోగించి,ట్రోఫీ ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా బహుమతుల ప్రదానోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాజీ జడ్పీటీసీ తేర గోవర్ధన్ రెడ్డి,ఎంపీపీ వంగాల ప్రతాప్ రెడ్డి లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటలలో గెలుపు ఓటములు సహజమని,ఓటమి విజయానికి నాంది అని అన్నారు. క్రిడాకారులు సమయస్ఫూర్తి ప్రదర్శించి భవిష్యత్ లో మంచి పేరు తెచుకోవలన్నారు. అనంతరం మొదటి బహుమతి సాధించిన బాలజీనాగర్ జట్టుకు రూ.20,116 లు మరియు ట్రోఫీ ని అందించారు. ద్వితీయ బహుమతి సాధించిన యువరాజ్ వారియర్స్ జట్టుకు రూ.15,116 ,ట్రోఫీ ని అందించారు..ఈ…

అమరుడు పిల్లి గిరి బాబు యాదవ్ విగ్రహం భూమి పూజ

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ అమరుడు పిల్లి గిరి బాబు యాదవ్ విగ్రహం భూమి పూజ కార్యక్రమం ఈ రోజు ముకుందపురం లో చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెరాస రాష్ట్ర నాయకులు నోముల భగత్ కుమార్ హాజరైనారు, తెలంగాణ రాష్ట్ర సాధన లో భాగంగా ఆత్మ బలిదానం చేసిన వారి జ్ఞాపకార్ధం లో భాగంగా అమరుడు పిల్లి గిరి బాబు యాదవ్ విగ్రహం భూమి పూజ కార్యక్రమం చేశారు, కార్యక్రమంలో నిడమానూరు ఎంపీపీ బొల్లం జయమ్మ గారు, ,నిడమానూరు AMC చైర్మెన్ కామర్ల జానయ్య గారు, వైస్ ఎంపీపీ వెంకటరెడ్డి గారు, మలిదశ ఉద్యమ కారులు హాలియా మున్సిపల్ కౌన్సిలర్ వర్రా వెంకట్ రెడ్డి గారు,కోప్షన్ మెంబెర్ సలీం గారు, సర్పంచ్ కేశ శంకర్ గారు., మలిదశ .ఉద్యమకారులు trs కొండల్ .తెరాస…