అక్రమ అరెస్ట్ లను ఖండించండి-కామ్రేడ్ బొల్గూరి

రైతాంగం ఆందోళనలకు మద్దతుగా, వ్యవసాయ చట్టాలపై ప్రజలకు చైతన్యం కలిగించేందుకు పౌరహక్కుల సంఘం, తెలంగాణ శాఖ జగిత్యాల జిల్లాలో పాద యాత్ర ప్లాన్ చేసింది. నిన్న (జనవరి 10) ప్రారంభం కావాల్సిన పాద యాత్ర నేపథ్యంలో ఆ పాదయాత్రకు ఏర్పాట్లు చేస్తున్న ఐదుగురు పౌరహక్కుల సంఘం నాయకులను పోలీసులు మొన్న అరెస్టు చేశారు.మొన్నటి అక్రమ అరెస్టుల గురించి అడగడానికి వెళ్లిన పౌరహక్కుల సంఘం అధ్యక్షులు డా.లక్ష్మణ్, హైకోర్టు న్యాయవాది రఘునాథ్, గుంటి రవి, లింగన్న తదితరులను అరెస్టు చేసిన జగిత్యాల పోలీసులు అరెస్టు చేసి కొడిమ్యాల పోలీసు స్టేషన్లో ఉంచినట్లు సమాచారం. కావునా అక్రమంగా అరెస్ట్ చేసిన పౌర హక్కుల సంఘం నాయకులందరిని వెంటనే భేషరత్తుగా విడుదల చేయాలనీ… ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU (స్టూడెంట్) తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది

Related posts

Leave a Comment