ఆరోగ్యంగా ఉంటే అన్నీ సాద్యమే- కంచర్ల

నల్లగొండ : ఆరోగ్యంగా ఉంటేనే  అన్నీ సాదించవచ్చని, జీవితంలో అనుకున్నది సాదించాలంటే శారీరక, మానసిక, ఆరోగ్యం ముఖ్యమని నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు,  నల్లగొండ పట్టణంలోని ప్రకాశం బజార్లో గల బాలాజి కాంప్లెక్స్ 4వ అంతస్తులో విన్నర్ వరల్డ్ తైక్వాండో, మిక్సీడ్ మార్షల్ ఆర్ట్స్ & ఫిట్ నెస్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఅంతర్జాతీయ, అత్యంత ఆదునిక పరికరాలతో ప్రాక్టీస్ చేయడం వల్ల రాష్ట్ర, జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో ఫలితాలు రాగలవన్నారు,       

తెలంగాణ తైక్వాండో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి A.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి పరికరాలను ఈ సెంటర్లో ఉపయోగిస్తున్నామని, తెలంగాణలో అతిపెద్ద అకాడమీగా విన్నర్ వరల్డ్ తైక్వాండో అకాడమీ నిలుస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి MD మక్బూల్ అహ్మద్, డైరెక్టర్ ఆఫ్ చీఫ్ కోచ్ MD. యూనుస్ కమాల్, M. సైదిరెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ మందడి సైదిరెడ్డి, సింగిల్ విండో ఛైర్మన్ D.శ్రీనివాస్,మాజీ కౌన్సిలర్ B.హరిక్రిష్ణ. సర్పంచ్ జానయ్య, వెంకటరమణ,మనోజ్ కుమార్,శుభమ్ శెట్టి, సురేశ్, ప్రదీప్, అంబటి ప్రణీత్, MD.నజీరుద్దీన్, అశోక్ మరియు వివిద జిల్లాల కొచ్ లు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment