ఓటమి విజయానికి నాంది

పి.ఏ. పల్లి: అంగడిపేట స్టేజీ నందు సంక్రాంతి పండుగ సందర్భంగా యువరాజ్ వారియర్స్ యూత్ అద్వర్యం లో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో ఈ రోజూ నిర్వహించిన ఫైనల్ మ్యాచ్ బాలాజీ నగర్ జట్టు విజయఢంకా మోగించి,ట్రోఫీ ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా బహుమతుల ప్రదానోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాజీ జడ్పీటీసీ తేర గోవర్ధన్ రెడ్డి,ఎంపీపీ వంగాల ప్రతాప్ రెడ్డి లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటలలో గెలుపు ఓటములు సహజమని,ఓటమి విజయానికి నాంది అని అన్నారు. క్రిడాకారులు సమయస్ఫూర్తి ప్రదర్శించి భవిష్యత్ లో మంచి పేరు తెచుకోవలన్నారు. అనంతరం మొదటి బహుమతి సాధించిన బాలజీనాగర్ జట్టుకు రూ.20,116 లు మరియు ట్రోఫీ ని అందించారు. ద్వితీయ బహుమతి సాధించిన యువరాజ్ వారియర్స్ జట్టుకు రూ.15,116 ,ట్రోఫీ ని అందించారు..ఈ కార్యక్రమంలో పి.ఏ. సి.ఎస్ చైర్మన్ ఎల్గురి వల్లప్ రెడ్డి,డైరెక్టర్ మద్దిమడుగు అచ్యుత్ కుమార్,టి. ఆర్. ఎస్ మండల నాయకులు వీరమల్ల పరమేష్,అర్వపల్లి నర్సింహ,మద్దిమడుగు కర్ణయ్య,ఉప సర్పంచ్ శేఖర్, రమావత్ శ్రీను నాయక్ పాల్గొనారు.

సేకరణ: విజయ్ కుమార్, పి.ఏ. పల్లి

Related posts

Leave a Comment