పి.ఏ. పల్లి: హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వారికి ఖర్చులు ప్రభుత్వం అందిస్తుంది
క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ క్షతగాత్రులకు దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ వ్యక్తిగతంగా రూ.10,000 ఆర్థిక సహాయం అందించారు.ఆదివారం హైదరాబాద్ ఆసుపత్రిలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శించారు. నవీన హాస్పిటల్ లో 7గురు,మోహన్ హాస్పిటల్ లో ఒకరు,హెల్త్ కేర్ హాస్పిటల్ లో ఒక్కరు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు అయే ఖర్చు మొత్తం ప్రభుత్వం అందిస్తుంది అని ఆయన తెలిపారు. ఎంపీపీ జాన్ యాదవ్ 5000 ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఆయన వెంట ఎంపీపీ జాన్ యాదవ్,సర్పంచ్ మల్లేష్,ప్రశాంత్ రావు తదితరులు పాల్గొన్నారు.
సేకరణ: విజయ్ కుమార్, పి.ఏ. పల్లి