గంగపుత్రుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

  • GO MS No 6 ను రద్దు చేయాలి
  • మత్స్యకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

తెలంగాణ రాష్ట్ర మత్స్య శాఖామాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి తెలంగాణ గంగపుత్రుల సంఘం ఆద్వర్యంలో వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా తెలంగాణ గంగపుత్రుల సంఘం అద్యక్షులు దీటి మల్లయ్య మాట్లాడుతూ గంగపుత్రుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, చేపలవేట బెస్తలు, గంగపుత్రులకే మొదటి ప్రాదాన్యతఆని తరువాతే ముదిరాజులకన్న KCR వాగ్ధానాన్ని నిలబెట్టుకోని రెండు కులాల మద్య ఘర్షణ లేకుండా చేయాలన్నారు, గంగపుత్రులకు అడ్డంకిగా ఉన్న GO No 6 ను వెంటనే రద్దు చేయాలని అలాగే వృతి నైపుణ్యత పరీక్షలకు సంబంధించిన GO No 74 ను అమలుపరచాలని  డిమాండ్ చేశారు,

తెలంగాణ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఫెడరేషన్ చైర్మన్ గా గంగపుత్రులకు నామినేట్ చేయాలని, మత్స్య పరిశ్రమ అభివృద్ది కొరకు మత్స్యకారుల కార్పొరేషన్ మరియు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన విదంగా బెస్త కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. గంగపుత్రుల “ఆత్మగౌరవ భవనము” నిర్మించుటకు తగు సహకారామందించాలనే డిమాండ్లను ముందుంచుతూ వినతి పత్రాన్ని అందచేశారు ఈ కార్యక్రమంలో కాపర్తి మోహనకృష్ణ, నెన్నెల నర్సయ్య, దొలి రాజలింగం, వెంపటి మధుసూదన్, దోలి రమేశ్, నల్లగొండ జిల్లా అద్యక్షులు ఇటికల సతీష్, నల్లగొండ జిల్లా యువజన అద్యక్షులు అంబటి ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment