గంగపుత్రుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన మంత్రి

గంగపుత్రులకే మొదటి ప్రాదాన్యత, గంగపుత్రులకు అడ్డంకిగా ఉన్న GO 6 ను రద్దు పరచే విషయం, గంగపుత్రుల “ఆత్మగౌరవ భవనము” నిర్మించుట మొదలగు అంశాలపట్ల మంత్రిగారు సానుకూలంగా స్పందించారని తెలంగాణ గంగపుత్రుల సంఘం అద్యక్షులు దేటి మల్లయ్య అన్నారు.  తెలంగాణ గంగపుత్రుల సంఘం యువజన అధ్యక్షులు అంబటి ప్రణీత్ జన్మదినం పురస్కరించుకొని రాష్ట్ర అధ్యక్షుల ఆశీస్సులు అందుకున్న సందర్భంగా వారు అన్నారు.  వారం రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర మత్స్య శాఖామాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి గంగపుత్రుల సమస్యలు విన్నవించామని అందులో GO 6 రద్దు అంశం, గంగపుత్రులకే మొదటి ప్రాదాన్యత, వృతి నైపుణ్యత పరీక్షలకు సంబంధించిన GO No 74 ను అమలు,  కొరకు మత్స్యకారుల కార్పొరేషన్, గంగపుత్రుల “ఆత్మగౌరవ భవనము” మొదలగు విషయాల గురించి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లామని వారు CM గారితో చర్చించి సత్వర నిర్ణయం తీసుకుంటామని మాటిచ్చారని ఈ  సందర్భంగా వెల్లడించారు. వారితో ఉపాద్యక్షులు కాపర్తి మోహనకృష్ణ, నల్లగొండ జిల్లా అద్యక్షులు ఇటికల సతీష్ ఉన్నారు

Related posts

Leave a Comment