ఘోర ప్రమాదం


నల్గొండ : పీ ఏ పల్లి మండలం నాగార్జున సాగర్ -హైదరాబాద్ హైవే అంగడిపేట స్టేజ్ ఎస్సార్ పెట్రోల్ బంకు దగ్గర ఘోర ప్రమాదం కూలీలతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొనడంతో ఐదుగురు కూలీలు, ఆటోడ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందారు. మృతులంతా మహిళలు. మరో 14మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిది దేవరకొండ మండలం చింతబాయి. ఆటోలో 20మంది ఉన్నట్లు తెలుస్తోంది. గాయాలైన వారిని దేవరకొండ ఆస్పత్రికి తరలించారు. వీరిలో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Related posts

Leave a Comment