ప్రభుత్వ ఉద్యోగులు తాము చేసిన సర్వీసు పూర్తి అయిన అనంతరం సమాజ సేవలో నిమగ్నం అవ్వాలని మిర్యాల శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు అన్నారు.ఆదివారం రాత్రి స్థానిక లక్ష్మీ కళ్యాణ మండపంలో బంజారా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన మిర్యాలగూడ రూరల్ ఏ ఎస్ఐ దశరథ రాజు పదవి విరమణ వీడ్కోలు సమావేశం లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.విధినిర్వహణలో బాధ్యతాయుతంగా పని చేయడంతో పాటు నేరాలను అదుపు చేయడంలో దశరథ రాజు విశేష కృషి చేశారన్నారు.ఎంతటి కేసునైనను సులువుగా ఛేదించగల సామర్థ్యం ఆయనకు ఉందన్నారు.ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడంతో పాటు నేరాలు అదుపు చేయడంలోనూ వారి కృషి మరువలేనిదన్నారు.మిర్యాలగూడ రూరల్ సిఐ రమేష్ బాబు మాట్లాడుతూ పలు దొంగతనాల కేసులు హత్య కేసులను చేదించే విషయంలో దశరథ రాజు పాత్ర విశేషమన్నారు.భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.కార్యక్రమానికి బంజారా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాలోతు దశరధ నాయక్ అధ్యక్షత వహించగా టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు స్కైలాబ్ నాయక్ మాజీ మార్కెట్ చైర్మన్ చిట్టిబాబు నాయక్ ఎంపీపీ సరళ,దామరచర్ల జెడ్ పి టి సి హాతి రామ్ నాయక్,ఉద్యోగుల సంఘం డివిజన్ కన్వీనర్ తిరుపతి నాయక్ భాష,మకల నాయక్,బాబు సింగ్ వెంకట్రామ్ భీమ్లా సేవ్యా నాయక్ శంకర్ నాయక్ సర్పంచుల ఫోరం మండలాధ్యక్షులు వెంకట రమణ చౌదరి తదితరులు పాల్గొన్నారు
పదవీ విరమణ అనంతరం సమాజ సేవలో నిమగ్నం అవ్వాలి-ఎమ్మెల్యే భాస్కరరావు
