యువత క్రీడల్లో రాణించాలి -ఎమ్మెల్యే రవీంద్ర కుమార్

గ్రామీణ ప్రాంత యువత క్రికెట్‌తో పాటు ఇతర జాతీయ క్రీడల్లో రాణించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని అందుకవసరమైన క్రీడా ప్రాంగణాలను నెల కోల్పడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పేర్కొన్నారు. శనివారం చందంపేట మండల పరిధిలోని పొల్లేపల్లి లో నిర్వహించిన లాలూ నాయక్ స్మారక క్రికెట్‌ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..గ్రామీణ ప్రాంత యువత అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.లాలూ నాయక్ స్మారక క్రికెట్‌ టోర్నమెంట్ లో మొదటి బహుమతి కైవసం చేసుకున్న దేవరకొండ టీంకు, రూ.20 వేల నగదు బహుమతి అందజేశారు. అలాగే రెండో బహుమతి కొండమల్లెపల్లి టీం కు రూ.10 వేలు, బహుమతి అందచేసి, అనంతరం ఆయన మాట్లాడుతూ.. లాలూ నాయక్ ప్రాతినిధ్యం ప్రజల బాగుకోసమే ఆయన రాజకీయం లో వచ్చారని అదేవిధంగా అలాంటి నాయుడు మన మధ్యలో లేక పోవడం నాకు చాలా బాధాకరమని ఎప్పుడు నా ఎన్నిక కోసం కృషి చేసేవాడని లాలూ నాయక్ ఆశయాల కోసం నేనెప్పుడూ సహకరిస్తానని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మకృష్ణయ్య, ఎంపీపీ పార్వతి,జడ్పీటీసీ రమావత్ పవిత్ర, నెరేడుగొమ్ము జడ్పీటీసీ బాలు నాయక్,టిఆర్ఎస్ దేవరకొండ మండలం పార్టీ అధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి, నెరేడుగొమ్ము అధ్యక్షుడు లోకసాని తిరుపతయ్య, మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య, మాజీ జడ్పీటీసీ బోయపల్లి శ్రీనివాస్ గౌడ్,సర్పంచుల మండల ఫోరమ్ అధ్యక్షుడు దొండేటి మల్లా రెడ్డి,నేనావత్ శ్రీను,మొదటి బహుమతి దాత లక్ష్మిపతి,రెండోవ బహుమతి నేనవత్ పార్వతి మకట్ లాల్ అన్నదానం దాత రమేష్,సర్పంచ్‌ లు అర్జున్,గోసుల కవిత అనంతగిరిగిరి,మాజీ ఎంపీటీసీ మహా లక్ష్మయ్య, జయకుమార్ ఉప సర్పంచ్ రమేష్, టిఆర్ఎస్ నాయకులు కొండల్ రెడ్డి బొడ్డుపల్లి కృష్ణ, శోభన్, చంద్ర బాబు.కేతవత్ సర్దార్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

-సేకరణ:విజయ్ కుమార్, పీఏపల్లి

Related posts

Leave a Comment