రాజకీయ లబ్దికోసమే మత విద్వేషాలు

నల్లగొండ : జకీయ లబ్దికోసమే మతవిద్వేషాలకు పాల్పడుతున్నారని ఉమ్మడి జిల్లా టిఆర్ఎస్ మహిళా విభాగంఅధ్యక్షురాలు.. నల్గొండ- సూర్యాపేట జిల్లాల స్త్రీ – శిశు సంక్షేమ శాఖ రీజినల్ ఆర్గనైజర్ మాలె శరణ్య రెడ్డి అన్నారు
నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారి క్యాంప్ కార్యాలయం వి టి కాలనీలో.. ఉమ్మడి జిల్లా టిఆర్ఎస్ మహిళా విభాగంఅధ్యక్షురాలు.. నల్గొండ- సూర్యాపేట జిల్లాల స్త్రీ – శిశు సంక్షేమ శాఖ రీజినల్ ఆర్గనైజర్ మాలె శరణ్య రెడ్డి ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..
నల్గొండలో బిజెపి పార్టీ వారు కెసిఆర్ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం పట్ల తమ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
బిజెపి వారు రాజకీయ లబ్ది కోసం మతాన్ని వాడుకుంటున్నారని
ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వారి చర్యలు ఉంటున్నాయని
కేంద్ర రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారు.
ఇప్పటికే కోరుట్ల ఎమ్మెల్యే తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పారని. అయినా కూడా ఆయన మాటలు వక్రీకరించి రాజకీయ లబ్ది పొందచూస్తున్నారని,


కెసిఆర్ కంటే హిందూ ఎవరని. అనేక యజ్ఞయాగాదులు నిర్వహించి హిందువులంతా గర్వించదగ్గ యాదాద్రి నీ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతున్నారని.. ప్రజా సమస్యల మీద పోరాడవలసిన మీరు కేవలం మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్ట లేక.. రాష్ట్రానికి మంచి చేయలేక పోతున్న
ప్రజలు మీ తీరును గమనిస్తున్నారని, మీ పద్ధతి మార్చుకోకుంటే ప్రజలే మీమీద తిరగబడతారని అన్నారు.
నాగర్ ఉప ఎన్నికల్లోనూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించపోతుందన్నారు.
ఈ ప్రెస్ మీట్ లో జిల్లా రైతు బంధు సమితి డైరెక్టర్ వనపర్తి జ్యోతి, సింగం లక్ష్మి, సంకు ధనలక్ష్మి, మామిడి పద్మ, కున్ రెడ్డి సరోజన, తిప్పర్తి, కనగల్,, నల్గొండ, మండలాల, మహిళా విభాగం అధ్యక్షురాళ్లు కోండ్ర స్వరూప, చనగోని సుమతి, బొబ్బిలి స్వరూప రెడ్డి, లు..దుబ్బ రూప, కంచర్ల విజయ రెడ్డి, కత్తుల సంధ్య, లలిత తదితరులు ఉన్నారు.

Related posts

Leave a Comment