రైతన్నకు కరెంట్ ఇబ్బందులు

కరెంటు లేక ఎండిపోతున్నా పంటలు ఇరవై నాలుగు గంటల విద్యుత్ దేవుడెరుగు.. కనీసం పన్నెండు గంటల పాటైనా త్రిపేస్ కరెంట్ ఇస్తే చాలని రైతన్నలు ఆశిస్తున్నారు. పెద్దగట్టు గ్రామంలో ఎవరిని పలకరించినా ఇదే మాట.రోజుకు రెండు మూడు గంటల కరెంటు అనేక అంతరాయాలతో ఇస్తున్నారు. గంటలోనే పది సార్లు కరెంట్ వచ్చిపోతుంటే.. పంటలు తడవక రైతులు కలత చెందుతున్నారు. ఇక తక్కువ ఓల్టేజ్, తరచూ ఫ్యూజులు పోవడం, ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోవడం, విద్యుత్ లైన్లు తెగిపోవడం వంటి సమస్యలకు తోడు మోటార్లు చెడిపోవడం, స్టార్టర్లు మొరాయించడం వంటి అనేక సమస్యలు కూడా ఒకదానిపై ఒకటి వచ్చి పడుతున్నాయి. ఏ రైతు పరిస్థితి చూసినా ఇది సర్వ సాధారణమైపోయింది. దీంతో రైతులంతా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. పంటలను ఎలా దక్కించుకోవాలని ఆలోచిస్తూ కంటినిండా నిద్ర కూడా పోవడం లేదు. కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎంతసేపుంటుందో కూడా తెలియని పరిస్థితి. ఒకవేళ కరెంటు ఉన్నా మోటార్లు ఎంతసేపు సరిగా నడుస్తాయో చెప్పలేని దుస్థితి ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్‌ సబ్‌ స్టేషన్ మంజూరు చెయ్యాలని రైతులు కోరుకుంటున్నారు…

సేకరణ: విజయ్ కుమార్ , పిఎ పల్లి.

Related posts

Leave a Comment