శాంతిభద్రతలను పరిరక్షించేది పోలీసు వ్యవస్థ -కంచర్ల భూపాల్ రెడ్డి

మారుతున్న కాలానికి అనుగుణంగా శాంతిభద్రతల సమస్యలు.. నేరాలు, అదుపు చేయటానికి, చురుకైన తెలివైన పోలీసు వ్యవస్థ అవసరమని. ఇందుకు రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను పటిష్ట పరిచిందని, దేశంలోనే రాష్ట్ర పోలీసు వ్యవస్థకు ప్రముఖ స్థానం ఉందని. మీరు కూడా పోలీస్ ఉద్యోగంలో సెలెక్ట్ అయి రాష్ట్రానికి సేవలందించాలని కోరుకుంటున్నానని, ఈ సెంటర్లో బాగా కష్టపడి చదువుకుని పోలీస్ గా సెలెక్ట్ అయిన వారికి తాను 50 వేల రూపాయల ప్రోత్సాహ బహుమతి అందిస్తానని., నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు అన్నారు. ఇంటర్ బోర్డు విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లో నిర్వహించిన పోలీసు సెలక్షన్ ట్రైనింగ్ సెంటర్ ముగింపు సమావేశంలో మాట్లాడుతూ అన్నారు.
ఈ సందర్భంగా తాను స్పాన్సర్ చేసి, ట్రైనింగ్ లో శిక్షణ పొందిన వారికి ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేశారు
ఈ కార్యక్రమంలో, గౌరవనీయులు జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ వేణు గారు.. కళాశాల ప్రిన్సిపల్ సుధారాణి, రెడ్క్రాస్ అధ్యక్షులు గోలి అమరేందర్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగొని రమేష్, ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పిల్లి రామరాజు యాదవ్, అశోక్ రెడ్డి మందడినర్సిరెడ్డి నాయకులు సింగం రామ్మోహన్ యుగంధర్ రెడ్డి రావుల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Related posts

Leave a Comment