గంగపుత్రుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన మంత్రి

గంగపుత్రులకే మొదటి ప్రాదాన్యత, గంగపుత్రులకు అడ్డంకిగా ఉన్న GO 6 ను రద్దు పరచే విషయం, గంగపుత్రుల “ఆత్మగౌరవ భవనము” నిర్మించుట మొదలగు అంశాలపట్ల మంత్రిగారు సానుకూలంగా స్పందించారని తెలంగాణ గంగపుత్రుల సంఘం అద్యక్షులు దేటి మల్లయ్య అన్నారు.  తెలంగాణ గంగపుత్రుల సంఘం యువజన అధ్యక్షులు అంబటి ప్రణీత్ జన్మదినం పురస్కరించుకొని రాష్ట్ర అధ్యక్షుల ఆశీస్సులు అందుకున్న సందర్భంగా వారు అన్నారు.  వారం రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర మత్స్య శాఖామాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి గంగపుత్రుల సమస్యలు విన్నవించామని అందులో GO 6 రద్దు అంశం, గంగపుత్రులకే మొదటి ప్రాదాన్యత, వృతి నైపుణ్యత పరీక్షలకు సంబంధించిన GO No 74 ను అమలు,  కొరకు మత్స్యకారుల కార్పొరేషన్, గంగపుత్రుల “ఆత్మగౌరవ భవనము” మొదలగు విషయాల గురించి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లామని వారు CM…

గీత కార్మికుల ఎక్స్గ్రేషియా చెల్లించాలి.

చండూరు మండలం తెర ట్ పల్లి,గ్రామం లో గీత కార్మికుడు బోయపల్లి పెద్ద మల్లయ్య గారు తడి చెట్టు పై నుండి కింద జారి పడటం జరిగిందిపరామర్శించిన గీత కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండ శ్రీశైలం వారిని పరామర్శించి గీత కార్మికులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందుతోంది తక్షణమే గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. గీత కార్మికుల కూడా నెలసరి జీతం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గీత కార్మికులకు లైసెన్స్ గాని పిఎఫ్ గాని అన్ని పూర్తిస్థాయిలో అందించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు బొట్టు శివ కుమార్, గీత కార్మికుడు పబ్బు మారయ్య, బోయపల్లి అంజయ్య, శీను, యాదయ్య, నరసింహ, తదితరులు ఉన్నారు

కరెంట్ షాక్ తగిలి వ్యక్తి మృతి

నల్గోండ జిల్లా పీ.ఏపల్లి మండలం చింతలతండా గ్రామంలో రమావత్ సోమ్లి(55)విద్యుత్‌ వైర్ తగిలి మృతి ఇంట్లో వెలుగులు నింపే కరెంట్ ఒక కుటుంబంలో చీకట్లు నింపింది విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యమే కారణం సకాలంలో స్పందించక పోవటం వల్లనే ఇలా.గత వారం రోజులుగా ఊర్లో ఉన్న ఎనభై ఇండ్లకు ఎర్త్ వస్తుంది ఈ విషయమై విద్యుత్ అధికారులను సర్పంచ్ ను యంపీటీసి తదితరులను సంప్రదించినా పంట్టించుకోకపోవడంతో ఈ రోజు నిండు ప్రాణాన్ని పొట్టన బెట్టుకున్నారు ఎర్త్ వస్తున్నప్పటికీ విద్యుత్‌ శాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవటంతో ఈ గోరం జరిగిందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. సేకరణ:విజయ్ కుమార్, పిఎ పల్లి.

యువత క్రీడల్లో రాణించాలి -ఎమ్మెల్యే రవీంద్ర కుమార్

గ్రామీణ ప్రాంత యువత క్రికెట్‌తో పాటు ఇతర జాతీయ క్రీడల్లో రాణించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని అందుకవసరమైన క్రీడా ప్రాంగణాలను నెల కోల్పడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పేర్కొన్నారు. శనివారం చందంపేట మండల పరిధిలోని పొల్లేపల్లి లో నిర్వహించిన లాలూ నాయక్ స్మారక క్రికెట్‌ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..గ్రామీణ ప్రాంత యువత అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.లాలూ నాయక్ స్మారక క్రికెట్‌ టోర్నమెంట్ లో మొదటి బహుమతి కైవసం చేసుకున్న దేవరకొండ టీంకు, రూ.20 వేల నగదు బహుమతి అందజేశారు. అలాగే రెండో బహుమతి కొండమల్లెపల్లి టీం కు రూ.10 వేలు,…

రైతన్నకు కరెంట్ ఇబ్బందులు

కరెంటు లేక ఎండిపోతున్నా పంటలు ఇరవై నాలుగు గంటల విద్యుత్ దేవుడెరుగు.. కనీసం పన్నెండు గంటల పాటైనా త్రిపేస్ కరెంట్ ఇస్తే చాలని రైతన్నలు ఆశిస్తున్నారు. పెద్దగట్టు గ్రామంలో ఎవరిని పలకరించినా ఇదే మాట.రోజుకు రెండు మూడు గంటల కరెంటు అనేక అంతరాయాలతో ఇస్తున్నారు. గంటలోనే పది సార్లు కరెంట్ వచ్చిపోతుంటే.. పంటలు తడవక రైతులు కలత చెందుతున్నారు. ఇక తక్కువ ఓల్టేజ్, తరచూ ఫ్యూజులు పోవడం, ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోవడం, విద్యుత్ లైన్లు తెగిపోవడం వంటి సమస్యలకు తోడు మోటార్లు చెడిపోవడం, స్టార్టర్లు మొరాయించడం వంటి అనేక సమస్యలు కూడా ఒకదానిపై ఒకటి వచ్చి పడుతున్నాయి. ఏ రైతు పరిస్థితి చూసినా ఇది సర్వ సాధారణమైపోయింది. దీంతో రైతులంతా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. పంటలను ఎలా దక్కించుకోవాలని ఆలోచిస్తూ కంటినిండా నిద్ర కూడా పోవడం లేదు. కరెంటు…

మృతుల కుటుంబాలను ఆదుకుంటాం -మంత్రి జగదీష్ రెడ్డి

-దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని అంగడిపేట వద్ద రోడ్ ప్రమాదంలో మృతి చెందిన క్షతగాత్రులకు ఆర్థిక సహాయం ప్రకటించిన మంత్రి జగదీష్ రెడ్డి,శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్-మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి మూడు లక్షల ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు వెల్లడించిన మంత్రి జగదీష్ రెడ్డి,శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ప్రమాద వార్త తెలిసిన వెంటనే స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.-సంఘటనకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు మంత్రి జగదీష్ రెడ్డి,మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గార్ల ద్వారా తెలీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్-ప్రమాద సంఘటన వివరాలు తెలుసుకుని అధికారులతో సమీక్షించిన మంత్రి జగదీష్ రెడ్డి,శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి-మూడు లక్షల ఆర్థిక సహాయం తో పాటు అర్హులైన వారికి రెండుపడకల ఇండ్లు,వారి పిల్లలకు ఉచిత విద్య ను అందించనున్నట్లు…

రాజకీయ లబ్దికోసమే మత విద్వేషాలు

నల్లగొండ : జకీయ లబ్దికోసమే మతవిద్వేషాలకు పాల్పడుతున్నారని ఉమ్మడి జిల్లా టిఆర్ఎస్ మహిళా విభాగంఅధ్యక్షురాలు.. నల్గొండ- సూర్యాపేట జిల్లాల స్త్రీ – శిశు సంక్షేమ శాఖ రీజినల్ ఆర్గనైజర్ మాలె శరణ్య రెడ్డి అన్నారునల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారి క్యాంప్ కార్యాలయం వి టి కాలనీలో.. ఉమ్మడి జిల్లా టిఆర్ఎస్ మహిళా విభాగంఅధ్యక్షురాలు.. నల్గొండ- సూర్యాపేట జిల్లాల స్త్రీ – శిశు సంక్షేమ శాఖ రీజినల్ ఆర్గనైజర్ మాలె శరణ్య రెడ్డి ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..నల్గొండలో బిజెపి పార్టీ వారు కెసిఆర్ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం పట్ల తమ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.బిజెపి వారు రాజకీయ లబ్ది కోసం మతాన్ని వాడుకుంటున్నారనిప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వారి చర్యలు ఉంటున్నాయనికేంద్ర రాష్ట్ర అధ్యక్షుడు…

కాంట్రాక్టుల లో పారదర్శకత పాటించాలి-కంచర్ల

నేడు నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు ప్రజా ప్రతినిధులు విద్యుత్ అధికారులతో,జరిపిన రివ్యూ సమావేశం లో ప్రజా ప్రతినిధులు పలు సమస్యలు ప్రస్తావించారు.నల్లగొండ నియోజకవర్గం లో 6 చోట్ల సబ్ స్టేషన్ ల ఏర్పాటుకు ప్రతిపాదనలు.నెల వారి క్రమం తప్పకుండ మీటర్ రీడింగ్ తీయాలనిఅదనంగా ట్రాన్ఫర్మర్ లు, లూజ్ లైన్ స్థంబాలు, మూడో వైర్ కొరకువిద్యుత్ కాంట్రాక్టు ఇచ్చే విషయం లో పారదర్శకత పాటించాలిసబ్ స్టేషన్ లలో ఆపరేటర్ ల పనితీరు బాగాలేదుగ్రామాలలో వీధి దీపాలకు స్తంభాల మంజూరు కొరకుఈ సమస్యలు పరిష్కారం కొరకు వెంటనే తగు చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కంచర్ల అధికారులను ఆదేశించారు..ఈ రివ్యూ సమావేశం లో విద్యుత్ శాఖ SC, DE, ADE, AE ల తోపాటు కనగల్, తిప్పర్తి, MPP లు SK కరీం…

ఘోర ప్రమాదం

నల్గొండ : పీ ఏ పల్లి మండలం నాగార్జున సాగర్ -హైదరాబాద్ హైవే అంగడిపేట స్టేజ్ ఎస్సార్ పెట్రోల్ బంకు దగ్గర ఘోర ప్రమాదం కూలీలతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొనడంతో ఐదుగురు కూలీలు, ఆటోడ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందారు. మృతులంతా మహిళలు. మరో 14మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిది దేవరకొండ మండలం చింతబాయి. ఆటోలో 20మంది ఉన్నట్లు తెలుస్తోంది. గాయాలైన వారిని దేవరకొండ ఆస్పత్రికి తరలించారు. వీరిలో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

MRPS నూతన గ్రామకమిటీల ఎన్నిక

నిడమనూర్: నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నిడమనూర్ మండలం లో MRPS నూతన గ్రామకమిటీ లను ఎన్నుకోవడం జరుగుతుంది. మహాజన సోషలిస్టు పార్టీ (MSP) సాగర్ నియోజకవర్గ అభ్యర్థి విజయవంతానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మహాజననేత మందకృష్ణ మాదిగ  గారి ఆదేశాల మేరకు గ్రామాలలో పూర్తిస్థాయి నిర్మాణం చేపట్టడం జరుగుతుందని. ఇప్పటికే మారుపాక, వెంకటపురం,వెనిగండ్ల,బంకాపురం, వల్లభాపురం, మొదలగు గ్రామాలలో నూతన గ్రామకమిటీ లను ఎన్నుకోవడం జరిగిందని  ఒక ప్రకటనలో తెలిపారు బకరం శ్రీనివాస్ మాదిగ. MRPS ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ నాయకులు మరియు నిడమనూర్ మండల ఇంచార్జీ. బొజ్జ చిన్న మాదిగ. MRPS  నల్గొండ జిల్లా సీనియర్ నాయకులు బొర్ర మోష మాదిగ. MRPS మండల అధికార ప్రతినిధి