నామినేషన్ దాఖలు చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి డా. పల్లా

నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు. గ్రాడ్యుయేట్ mlc పదవికి తన నామినేషన్ ను కాలెక్టరేట్ లో రిటర్నింగ్ అధికారి వద్ద దాఖలు చేసినఅభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి…. హాజరైన మంత్రులుజగదీష్ రెడ్డి…. ఎర్రబెల్లి..సత్యవతి రాథోడ్…పువ్వడా… విప్ సునీత…… అంతకు ముందు భారీ ర్యాలీ నిర్వహించారు MLA లు.ఎంపీ లు..MLC లు గ్రాడ్యుయేట్ ఓటర్లు హాజరయ్యారు…..

రేపటి నుండే 6, 7, 8 తరగతులు ప్రారంభం : సబితా ఇంద్రారెడ్డి

రేపటి నుండే 6, 7, 8 తరగతులు ప్రారంభం కానున్నాయని తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఆదేశాలకు అనుగుణంగా 6, 7 , 8 తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆమె వెల్లడించారు. 6, 7, 8 తరగతులను రేపటి నుండి మార్చి ఒకటవ తేదీలోగా ప్రారంభించుకోవచ్చని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. అయితే.. కోవిడ్ మార్గదర్శక సూత్రాలను తప్పనిసరిగా పాటించాలని ఆమె సూచించారు. విద్యార్థులరను పాఠశాలకు పంపే విషయంలో మాత్రం తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. కాగా.. చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి కారణంగా విద్యా వ్యవస్థ అస్తవ్యస్థం అయిన విషయం తెలిసిందే. అయితే.. కరోనా వ్యాక్సిన్‌ రావడం, ఈ మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టడం రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాసంస్థలను పునః ప్రారంభించాలని…

గంగపుత్ర సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా మునాసు ప్రసన్న

నల్లగొండ: గంగపుత్ర సమస్యలపరిష్కారం కొరకు,బలహీనవర్గాల అభివృద్ధి కోసం విరివిగా కృషి చేస్తున్న నల్లగొండ నివాసి అయిన మునాసు ప్రసన్న కుమార్ సేవలు గుర్తించి “తెలంగాణ గంగపుత్ర సంఘం” నల్లగొండ జిల్లా ప్రధాన కార్యాదర్శిగా నియమిస్తున్నట్లురాష్ట్ర అద్యక్షులు దీటిమల్లయ్య తెలియజేశారు ,ఈ సందర్బంగా జిల్లాలోని అన్ని గ్రామ,మండల కమిటీలను ఏర్పాటు చేసి సంఘం బలోపేతానికి కృషి చేస్తాన్నన్నారు. ఈ కార్యక్రమంలో “తెలంగాణ గంగపుత్ర సంఘం” నల్లగొండ  జిల్లా అద్యక్షులు ఇటికల సతీష్, యూత్ అద్యక్షులు అంబటి ప్రణీత్ మొదలగు వారు పాల్గొన్నారు.

మిక్సిడ్ మార్షల్ ఆర్ట్స్ రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లాకు బంగారు పతాకాలు

 మిక్సిడ్ మార్షల్ ఆర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ వారి ఆద్యర్యంలో కొంపల్లి, హైదరాబాద్ ఈగల్ స్పోర్ట్స్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఛాంపియన్ షిప్ లో నల్లగొండ జిల్లాకు చెందిన MD.జావిద్ (అండర్ 61.2) MD.అమన్ బేగ్ (అండర్ 75) లు బంగారు పథకాలు సాదించారు. ఈ సందర్భంగా MD. యూనుస్ కమాల్ వారిని అభినందిస్తూ మిక్సిడ్ మార్షల్ ఆర్ట్స్ అనేది కఠినమైన ఆట అందులో స్ట్రైకింగ్ క్లించింగ్ మరియు గ్రాబింగ్ నందు పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచ దేశాల్లో ఎంతో ప్రావీణ్యం ఉన్న మార్షల్ ఆర్ట్స్ నల్లగొండలో అభివృద్ధి చెందడం సంతోషించదగ్గ విషయం అన్నారు.

ఇల్లు సాధించే వరకు పోరాటం ఆగదు-కొండ వెంకన్న

అప్పాజిపేట గ్రామం లో ఇళ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిన భూమిలో పేదలు గుడిసెలు వేసుకున్న వారిని కలిసి ప్రభత్వం ఇల్లు ఇచ్చేంత వరకూ పోరాటం ఆగదని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేదవాడికి మూడెకరాల భూమి ఇస్తానని ఇవ్వకుండా మోసం చేసిందన్నారు ఇండ్ల కొరకు పేదలు అప్పాజిపేట నుండి నల్లగొండ ఎమ్మార్వో కార్యాలయం వరకూ పాదయాత్ర నిర్వహించి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్బంగా కెవిపిఎస్ మండల కార్యదర్శి బొల్లు రవీంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద వారి సొంత ఇంటి కల కలగానే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు 1995 లో నంద్యాల నరసింహ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో పేదల ఇళ్ల స్థలాల…

పార్టీ కార్యకర్తలకు ప్రమాద బీమా – జగదీష్ రెడ్డి

పార్టీ కోసం పని చేసే కార్యకర్తలను పార్టీ కాపాడుతుందని,పార్టీ సభ్యులు ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయల బీమా సౌకర్యం ఏర్పాటు చేసిందని, వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర విద్యుత్ శాఖామాత్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు అన్నారు. నల్గొండ జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి గారు,నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారితో కలిసి mla క్యాంపు కార్యాలయంలో, నల్లగొండ నియోజక వర్గానికు చెందిన కనగల్ మండలం బొమ్మేపల్లి,అమ్మగూడెం గ్రామ పంచాయతీకి చెందిన దుబ్బ గణేష్(28) చెరువులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించడంతో,అతని భార్య దుబ్బ రూప కు, నల్లగొండ మండలం జి చన్నారం గ్రామానికి చెందిన గుర్రంఅలివేలు(35) చెరువులో ఉన్న గేదెలను బయటకు రప్పించే ప్రయత్నం లో మునిగి చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులకు…

అక్రమ అరెస్టులతో ఎబివిపిని అడ్డుకోలేరు-ఎబివిపి

నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి నల్గొండ పర్యటన నేపథ్యంలో విద్యార్థుల సమస్యల మీద అనుక్షణం గలమెత్తుతున్న అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ కు భయపడి అక్రమ అరెస్టులకు పాల్పడడం జరిగింది. ఈ సందర్భంగా ఎబివిపి రాష్ట్ర నాయకుడు పొట్టిపాక నాగరాజు మాట్లాడుతూ అరెస్టులతో మా గొంతును ఆపలేరని నిరంకుశంగా పరిపాలిస్తూ ప్రజల జీవితాలతో, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి నల్గొండలో అడుగుపెట్టే అర్హత లేదని మండిపడ్డారు. ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ కారుపోతుల రేవంత్ మాట్లాడుతూ నల్గొండను దత్తత తీసుకుంటా అన్నా దగుల్బాజీ ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఈ జిల్లా మొహం చూడకుండా నాగార్జున సాగర్ ఎన్నికల వచ్చే సరికి మళ్లీ ఇక్కడి ప్రజలను మోసం చేయడానికి వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి రానున్న రోజుల్లో ఏబీవీపీ తగిన సమాధానం చెబుతుందని హెచ్చరించారు. ప్రజల జీవితాన్ని గాలికి…

జిల్లాకు నిధుల వెల్లువ

రాష్ట్ర ముఖ్యమంత్రి నల్గొండ పర్యటన లో బాగంగా హాలియా దన్యవాద సభలో జిల్లాకు బారిగా వారాల జల్లు కురిపించారు, ప్ర్యత్యేక ప్యాకేజీలను ప్రకటించారు నల్గొండ జిల్లాలో ని 844 గ్రామ పంచాయతీ లకు అభివృద్ధి కోసం ఒక్కో గ్రామానికి 20 లక్షలు, ఒక్కో మండలానికి 30 లక్షలు, జిల్లా కేంద్రంలో ని నల్గొండ మున్సిపాలిటీ కి 10 కోట్లు, మిర్యాలగూడ మున్సిపాలిటీ కి 5 కోట్లు, మిగిలిన మున్సిపాలిటీ లకు ఒక్కో కోటి ఛోప్పున మంజూరు చేస్తున్నట్లు …..రేపే దీనికి సంబందించిన GO విడుదల చేస్తామని ప్రకటించారు ……త్వరలోనే కొత్తగా పెన్షన్ లను అప్లై చేసుకున్న వారికి మంజూరు చేస్తాంమని, అనారు,ఈ సందర్బంగా “కొత్త రేషన్ కార్డ్ లు కూడా ఇస్తాంమని…….అనాదిగా నల్గొండ జిల్లా నష్టాలకు కష్టాలకు గురైంది…. ఎవ్వరు పట్టించుకోలే…సమైక్యా పాలకులు చిన్న చూపు చూసారు…….2003లో…

ఐదు లిఫ్టులకు రూ.600.19కోట్లు మంజూరు

-నేలికల్ వద్ద శంకుస్థాపన -లిఫ్టులతో నియోజకవర్గం సస్యశ్యామలం-లిఫ్టులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్పెద్దఅడిశర్లపల్లి (సామాజిక తెలంగాణ) ఫిబ్రవరి 9నియోజకవర్గానికి ఐదు లిఫ్టులకు రూ.600.19కోట్లు మంజూరు కావడం జరిగింది అని దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.మంగళవారం పిఏపల్లి మండలంలోని AKBR లిఫ్టును,పెద్దగట్టు లిఫ్టులను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరిశీలించారు.అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చందంపేట మండలం కంబాలపల్లి లిఫ్టుకు రూ.212.16కోట్లు 8244 ఎకరాలకు సాగు నీరు,నేరడుగొమ్ము మండలం వైజాక్ కాలనీ వద్ద (అమ్మభావాని లిఫ్ట్) రూ.186.56కోట్లు 13048ఎకరాలకు సాగు నీరు,పిఏపల్లి మండలం పెద్దగట్టు లిఫ్టు రూ.85.31కోట్లు 4100 ఎకరాలకు సాగు నీరు,AKBR లిఫ్టుకు రూ.91కోట్లు, చందంపేట మండలం పొగిళ్ళ లిఫ్టు రూ.25.16కోట్లు 1119 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు…