అక్రమ అరెస్టులతో ఎబివిపిని అడ్డుకోలేరు-ఎబివిపి

నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి నల్గొండ పర్యటన నేపథ్యంలో విద్యార్థుల సమస్యల మీద అనుక్షణం గలమెత్తుతున్న అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ కు భయపడి అక్రమ అరెస్టులకు పాల్పడడం జరిగింది. ఈ సందర్భంగా ఎబివిపి రాష్ట్ర నాయకుడు పొట్టిపాక నాగరాజు మాట్లాడుతూ అరెస్టులతో మా గొంతును ఆపలేరని నిరంకుశంగా పరిపాలిస్తూ ప్రజల జీవితాలతో, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి నల్గొండలో అడుగుపెట్టే అర్హత లేదని మండిపడ్డారు. ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ కారుపోతుల రేవంత్ మాట్లాడుతూ నల్గొండను దత్తత తీసుకుంటా అన్నా దగుల్బాజీ ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఈ జిల్లా మొహం చూడకుండా నాగార్జున సాగర్ ఎన్నికల వచ్చే సరికి మళ్లీ ఇక్కడి ప్రజలను మోసం చేయడానికి వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి రానున్న రోజుల్లో ఏబీవీపీ తగిన సమాధానం చెబుతుందని హెచ్చరించారు. ప్రజల జీవితాన్ని గాలికి వదిలేసి ప్రగతి భవన్ కే పరిమితమైన ముఖ్యమంత్రికినల్గొండ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగర సంఘటన కార్యదర్శి రుద్ర విగ్నేష్ ,శివ గోవర్ధన్ , దయాకర్,సంపత్, చత్రపతి తదితరులు పాల్గొన్నారు

Related posts

Leave a Comment