ఐదు లిఫ్టులకు రూ.600.19కోట్లు మంజూరు


-నేలికల్ వద్ద శంకుస్థాపన

-లిఫ్టులతో నియోజకవర్గం సస్యశ్యామలం
-లిఫ్టులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు

  • ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
    పెద్దఅడిశర్లపల్లి (సామాజిక తెలంగాణ) ఫిబ్రవరి 9
    నియోజకవర్గానికి ఐదు లిఫ్టులకు రూ.600.19కోట్లు మంజూరు కావడం జరిగింది అని దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.మంగళవారం పిఏపల్లి మండలంలోని AKBR లిఫ్టును,పెద్దగట్టు లిఫ్టులను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరిశీలించారు.అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చందంపేట మండలం కంబాలపల్లి లిఫ్టుకు రూ.212.16కోట్లు 8244 ఎకరాలకు సాగు నీరు,నేరడుగొమ్ము మండలం వైజాక్ కాలనీ వద్ద (అమ్మభావాని లిఫ్ట్) రూ.186.56కోట్లు 13048ఎకరాలకు సాగు నీరు,పిఏపల్లి మండలం పెద్దగట్టు లిఫ్టు రూ.85.31కోట్లు 4100 ఎకరాలకు సాగు నీరు,AKBR లిఫ్టుకు రూ.91కోట్లు, చందంపేట మండలం పొగిళ్ళ లిఫ్టు రూ.25.16కోట్లు 1119 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు ఆయన తెలిపారు.లిఫ్ట్ లను మంజూరు కావడం వల్ల అపరుప్లాటు రైతులకు సాగు నీరు ఇవ్వడం జరుగుతుంది అని ఆయన తెలిపారు.నాగార్జునసాగర్ నిర్మాణంలో ముంపునకు గురై పునరావసలుగా ఉన్న గ్రామాలు,తాండలు ఇక్కడ ఎక్కువ శాతం గిరిజనులు నివాసం ఉంటు వర్షం ద్వార పంటలు పండించుకుంటు జీవనం సాగిస్తున్నారు అని ఆయన తెలిపారు.గుట్టలు,కొండలు ఉండటం ద్వారా సాగర్ నీరు అందడం లేదు అని,ఎత్తిపోతల ద్వారా సాగర్ బ్యాక్ వాటర్ నీరు పారుదల సౌకర్యం కల్పించడం వల్ల సస్యశ్యామలంగా మారుతుంది అని ఆయన తెలిపారు.నియోజకవర్గ ప్రజల తరుపున ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ వంగల ప్రతాప్ రెడ్డి,మాజీ జడ్పీటీసీ తేరా గోవర్ధన్ రెడ్డి,PACS చైర్మన్ వలపు రెడ్డి,ముచ్చర్ల ఏడుకొండలు, వైస్ ఎంపీపీ అర్వపల్లి సరితా నర్సింహా,PACS వైస్ శిరసనవడా శ్రీను,మునగాల అంజి రెడ్డి,రెటీనేని ముత్యపు రావు,ఎర్ర యాదగిరి,సర్పంచ్ నరేందర్, ఉప సర్పంచ్ మోతిలాల్, కోపరేట్ బ్యాంక్ డైరెక్టర్ సీతారాం, మాజీ ఎంపిటిసి శంకర్, ఖీమా, శేఖర్ రెడ్డి,పరమేష్,వెంకటయ్య, సుధాకర్,కొండల్, గోవింద్, నరేష్, నాగ, రాము, మోహన్, తదితరులు పాల్గొన్నారు.

సేకరణ :

విజయ్ కుమార్. పి ఏ పల్లి .

Related posts

Leave a Comment