ఖాళీపోస్టులను వెంటనే భర్తీ చేయాలి-పన్నాల

పిఆర్సి రిపోర్టు ప్రకారం వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఒక లక్షా తొంబై ఒక వెయ్యి పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రొఫెసర్ కోదండరాం గెలుపు కోసం నిడమనూరు మండల కేంద్రంలో ప్రచారం చేస్తూ విలేకరుల సమావేశంలో మాట్లాడినారు ప్రభుత్వ హామీ ఇచ్చిన విధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని అన్ని ప్రభుత్వ శాఖలోని ఉద్యోగులకు ప్రమోషన్ ఇచ్చి ఉపాధ్యాయులకు మాత్రమే ప్రమోషన్స్ ఆపడం విచారకరమని వెంటనే ప్రమోషన్ షెడ్యూల్ ప్రకటించాలని ఉద్యోగులందరికీ వెంటనే పి ఆర్ సి లో 45 శాతము ఫిట్మెంట్ ప్రకటించి అమలు చేయాలని కోరినారు పట్టభద్రులు అందరూ ఆత్మ అభిమానం చాటుకొని విధంగా ప్రొఫెసర్ కోదండరామ్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూరు సాగర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఎర్రం పాపిరెడ్డి విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షులు ధీరావత్ వీర నాయక్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు .

Related posts

Leave a Comment