పార్టీ కార్యకర్తలకు ప్రమాద బీమా – జగదీష్ రెడ్డి

పార్టీ కోసం పని చేసే కార్యకర్తలను పార్టీ కాపాడుతుందని,పార్టీ సభ్యులు ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయల బీమా సౌకర్యం ఏర్పాటు చేసిందని, వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర విద్యుత్ శాఖామాత్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు అన్నారు. నల్గొండ జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి గారు,నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారితో కలిసి mla క్యాంపు కార్యాలయంలో, నల్లగొండ నియోజక వర్గానికు చెందిన కనగల్ మండలం బొమ్మేపల్లి,అమ్మగూడెం గ్రామ పంచాయతీకి చెందిన దుబ్బ గణేష్(28) చెరువులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించడంతో,అతని భార్య దుబ్బ రూప కు, నల్లగొండ మండలం జి చన్నారం గ్రామానికి చెందిన గుర్రంఅలివేలు(35) చెరువులో ఉన్న గేదెలను బయటకు రప్పించే ప్రయత్నం లో మునిగి చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయల చొప్పున పార్టీ సభ్యత్వ బీమా చెక్కుల ను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కనగల్ ఎంపీపీ కరీం పాషా, జెడ్పిటిసి చిట్ల వెంకటేశం, సింగిల్విండో చైర్మన్ వంగాల సహదేవరెడ్డి,నల్గొండ కనగల్ మండల పార్టీ అధ్యక్షులు దేప వెంకట్ రెడ్డి, అయిత గొని యాదయ్య,బకరం వెంకన్న, అమ్మగూడెం సర్పంచ్ సింగం కోటేష్ రవీందర్ రావు లోడoగి గోవర్ధన్,జిల్లా శంకర్, సాంబయ్య పరమేశ్,తదితరులు పాల్గొన్నారు

Related posts

Leave a Comment