మా భూములు మాకే -ఎబివిపి నల్లగొండ

నల్లగొండ లోని స్థానిక క్లాక్టవర్ సెంటర్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ భూములను విద్యార్థులు అవసరాలకి ఉపయోగించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ నాయుడు పొట్టిపాక నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించి యూనివర్సిటీ భూములను కబ్జాలకు పాల్పడుతుందని మండిపడ్డారు.యూనివర్సిటీ భూమిలో చేపల మార్కెట్ కట్టడం అనేది అవివేకమైన చర్య అని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఏబీవీపీ ఉద్యమం చేపడుతుందని హెచ్చరించారు. ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ కారుపోతుల రేవంత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని అధికారంలోకి రాకముందు కెసిఆర్ తెలంగాణలోని యూనివర్సిటీలను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలా మారుస్తా అని చెప్పి ఈ రోజు ఉన్న యూనివర్సిటీ భూముల కబ్జాలు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని యూనివర్సిటీ భూములను విద్యార్థుల అవసరాలకే ఉపయోగిస్తూ యూనివర్సిటీల అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నగర సంఘటన కార్యదర్శి విగ్నేష్, యూనివర్సిటీ నాయకులు , చత్రపతి,ఆవుల సంపత్,ఏపూరి దయాకర్, బ్రహ్మం, ఉదయ్,సుఖేందర్, నర్సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Related posts

Leave a Comment