రేపటి నుండే 6, 7, 8 తరగతులు ప్రారంభం : సబితా ఇంద్రారెడ్డి

రేపటి నుండే 6, 7, 8 తరగతులు ప్రారంభం కానున్నాయని తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఆదేశాలకు అనుగుణంగా 6, 7 , 8 తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆమె వెల్లడించారు. 6, 7, 8 తరగతులను రేపటి నుండి మార్చి ఒకటవ తేదీలోగా ప్రారంభించుకోవచ్చని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.

అయితే.. కోవిడ్ మార్గదర్శక సూత్రాలను తప్పనిసరిగా పాటించాలని ఆమె సూచించారు. విద్యార్థులరను పాఠశాలకు పంపే విషయంలో మాత్రం తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు.

కాగా.. చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి కారణంగా విద్యా వ్యవస్థ అస్తవ్యస్థం అయిన విషయం తెలిసిందే. అయితే.. కరోనా వ్యాక్సిన్‌ రావడం, ఈ మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టడం రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాసంస్థలను పునః ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాయి.

Related posts

Leave a Comment