ఐదు లిఫ్టులకు రూ.600.19కోట్లు మంజూరు

-నేలికల్ వద్ద శంకుస్థాపన -లిఫ్టులతో నియోజకవర్గం సస్యశ్యామలం-లిఫ్టులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్పెద్దఅడిశర్లపల్లి (సామాజిక తెలంగాణ) ఫిబ్రవరి 9నియోజకవర్గానికి ఐదు లిఫ్టులకు రూ.600.19కోట్లు మంజూరు కావడం జరిగింది అని దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.మంగళవారం పిఏపల్లి మండలంలోని AKBR లిఫ్టును,పెద్దగట్టు లిఫ్టులను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరిశీలించారు.అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చందంపేట మండలం కంబాలపల్లి లిఫ్టుకు రూ.212.16కోట్లు 8244 ఎకరాలకు సాగు నీరు,నేరడుగొమ్ము మండలం వైజాక్ కాలనీ వద్ద (అమ్మభావాని లిఫ్ట్) రూ.186.56కోట్లు 13048ఎకరాలకు సాగు నీరు,పిఏపల్లి మండలం పెద్దగట్టు లిఫ్టు రూ.85.31కోట్లు 4100 ఎకరాలకు సాగు నీరు,AKBR లిఫ్టుకు రూ.91కోట్లు, చందంపేట మండలం పొగిళ్ళ లిఫ్టు రూ.25.16కోట్లు 1119 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు…

మా భూములు మాకే -ఎబివిపి నల్లగొండ

నల్లగొండ లోని స్థానిక క్లాక్టవర్ సెంటర్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ భూములను విద్యార్థులు అవసరాలకి ఉపయోగించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ నాయుడు పొట్టిపాక నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించి యూనివర్సిటీ భూములను కబ్జాలకు పాల్పడుతుందని మండిపడ్డారు.యూనివర్సిటీ భూమిలో చేపల మార్కెట్ కట్టడం అనేది అవివేకమైన చర్య అని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఏబీవీపీ ఉద్యమం చేపడుతుందని హెచ్చరించారు. ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ కారుపోతుల రేవంత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని అధికారంలోకి రాకముందు కెసిఆర్ తెలంగాణలోని యూనివర్సిటీలను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలా మారుస్తా అని చెప్పి ఈ రోజు ఉన్న యూనివర్సిటీ భూముల కబ్జాలు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని…