విద్యాసంస్థల బంధువు …పల్లా ….. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

విద్యారంగ సమస్యల పట్ల నిరంతరం నిరంతరం ప్రతిస్పందించే వ్యక్తి పల్లా రాజేశ్వర్ రెడ్డి అని అతను రైతుబంధు గాక విద్యాసంస్థల ఆత్మీయ బంధువు అని స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు.పల్లా గెలుపు కోసం విద్యా సంస్థల యాజమాన్యాలు మరియు విద్యా సంస్థలు ఉపాధ్యాయ ఉపాధ్యాయ సిబ్బంది కృషి చేయాలని వారికి మొదటి ప్రాధాన్యత ఓట్లు మాత్రమే వేసి వారి గెలుపు అందరూ కృషి చేయాలని కోరారు.స్థానిక న్యూస్ హైస్కూల్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.కార్యక్రమంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పట్టభద్రుల అభ్యర్థులకు కరపత్రాలు అందజేసిప్రాధాన్యత ఓటు వేయవలసిందిగా అభ్యర్థించారు.కార్యక్రమంలో కేజీ టు పీజీ విద్యాసంస్థల చైర్మన్ గింజల రమణారెడ్డి మాట్లాడుతూ
ప్రైవేటు విద్యాసంస్థల మనుగడకు అభివృద్ధికి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు దోహదపడుతుందని అన్నారు.వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారంలో వారికి మొదటి ప్రాధాన్యత ఓటు పల్లా రాజేశ్వర్ రెడ్డి కి బ్యాలెట్ పేపర్ లో మూడో నెంబర్ ఎదురుగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి వేసి గెలిపించాలని కోరారు.ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న అర్హత గల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది కి ఆరోగ్య భద్రత కార్డు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రాధాన్యతను కల్పిస్తూ 150 గజాల సొంత స్థలం కలిగినవారికి ఇంటి నిర్మాణం కొరకు ఐదు నుండి ఆరు లక్షల వరకు నగదు సహకారం అందిస్తారని వారు విద్యాసంస్థల యజమానులకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు.మరియు వివిధ సమస్యల పరిష్కార గొంతుగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిని మరొకసారి ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధాన కర్తగా ఉండేలా చూడాలని ఆయన పట్టభద్రులను కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రతి పాఠశాల లోని పట్టభద్రులు పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం అవిశ్రాంతంగా శ్రమించాలని కోరారు వారికి మొదటి ప్రాధాన్యత ఓట్లు మాత్రమే వేసి స్నేహితులకు బంధువులకు శ్రేయోభిలాషులకు చెప్పి వారిని మెప్పించే అందరూ కృషి చేయాలని కోరారు.ఎమ్మెల్సీ వల్ల గెలుపు కోసం ప్రచారంలో భాగంగా ప్రతి విద్యా సంస్థ వద్దకు వెళ్ళి నేరుగా యాజమాన్య బోధన బోధనేతర గడపగడపకు కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారి సహకారంతో ముందుకు వెళతామని అన్నారు. అనంతరం స్థానిక డాన్ బోస్కో అకాడమీ లో పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సుంకరి మల్లేష్ గౌడ్, ఛాయా సోమేశ్వర ఆలయం చైర్మన్ న్యూస్ హైస్కూల్ వ్యవహర్త అనంతరెడ్డి, డాన్ బోస్కో అకాడమీ ప్రిన్సిపల్ బాల శౌరి రెడ్డి, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఖుర్షీద్, గంట్ల పద్మ అలుగుబెల్లి తిరుమల్ రెడ్డి, ట్రస్మా నాయకులు జి వి రావు ముక్కామల నరసింహ, ఎండి అజీజ్, పాముల అశోక్ ముదిరాజ్, భోగరి భిక్షం, న్యూస్ హైస్కూల్ ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment