రేపే POCO M3 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్

కొద్ది రోజుల క్రితం గ్లోబల్ మార్కెట్‌లో పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. షావోమీ, రియల్‌మీ, ఒప్పో, వివో లాంటి కంపెనీలకు పోటీగా తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది పోకో. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ఇండియాకు ఎప్పుడు వస్తుందా అని పోకో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. జూన్ 8న ఇండియాలో పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కానుంది. POCO M3 Pro 5G Smart Phone Features: Storage & RAM 4GB+64GB, 6GB+128GB Dimensions Height: 161.81mmWidth: 75.34mmThickness: 8.92mmWeight: 190g Display6.5″ FHD+ Dot Display Resolution: 2400 x 1080Contrast ratio: 1500:1Refresh rate: 90HzDynamicSwitch display: 30Hz/50Hz/60Hz/90HzReading mode 3.0360° ambient light sensors ProcessorMediaTek Dimensity 700CPU: Arm Cortex-A76 ,7nm…

గులాబీ గూటికి టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ?

తెలంగాణలో టీడీపీకి మరో భారీ షాక్ తగలనుంది.. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ  టీఆర్ఎస్‌లో చేరేందుకు మార్గం సుగుమం అయ్యింది.. ఎమ్మెల్సీ పదవిపై హామీ లభించడంతో ఎల్‌.రమణ టీఆర్ఎస్‌ పార్టీలో చేరేందుకు దాదాపు రంగం సిద్ధమైంది.  ఈ వారంలోనే ఎల్‌.రమణ టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశాలు కనబడుతున్నాయి. టీటీడీపీ అధ్యక్షుడుగా ఉన్న ఎల్‌.రమణ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న పా​ర్టీ నేతలు గత సెప్టెంబర్‌లో తిరుగుబాటుకు దిగారు. తెలంగాణ పార్టీ నాయకత్వ మార్పు కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. గత ఏడేళ్లుగా ఒకే వ్యక్తి అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారని, రాష్ట్రంలో పార్టీ ఉనికి ఆందోళనలో పడిందని, ఇప్పటికైనా అధ్యక్షుడిని మార్చాలంటూ వారు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రమణ సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. 

ఐకెపి సెంటర్ సందర్శించిన తెలంగాణ జన సమితి నాయకులు

నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం లోని కురుమర్తి గ్రామములో ఉన్న ఐకెపి సెంటర్ ను తెలంగాణ జన సమితి నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మారబోయిన శ్రీధర్ మరియు ఇతరులు సందర్శించారు. రైతులు ధాన్యము తీసుకువచ్చి రెండు నెలలు అవుతున్నప్పటికీ ఇంకా పూర్తిగా కొనుగోలు చేయలేదని ఇప్పటికే రెండు మూడు సార్లు వర్షం పడి ధాన్యపు గింజలు తడిసి మొలకెత్తుతున్న వి అని రైతులు ఆవేదన వెలిబుచ్చారు ప్రభుత్వం తక్షణమే స్పందించి కొనుగోలు చేయాలని తెలంగాణ జన సమితి జిల్లా కమిటీ జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేయడం జరిగింది. రైతులు ఆత్మహత్యకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలి అని జిల్లా అధ్యక్షుడు గోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

జూన్ 8 న కేబినెట్ సమావేశం

రాష్ట్ర కేబినెట్ సమావేశం, జూన్ 8 న మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు, ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరుగనున్నది. రాష్ట్రంలో వైద్యం, కరోనా స్థితిగతులు, ఇరిగేషన్, రైతుబంధు, వ్యవసాయం పనులు, లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అనే అంశాల మీద కేబినెట్ చర్చించే అవకాశమున్నది. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలో భాగంగా, ప్రాజెక్టుల పనుల పురోగతి, చేపట్టవలసిన చర్యలు, వానాకాలం సాగునీరు, తదితర సంబంధిత అంశాల మీద సమీక్ష జరిగే అవకాశమున్నది. వానాకాలం పంటల సాగు పనులు ప్రారంభమైన నేపథ్యంలో, పంట పెట్టుబడి సాయం రైతుబంధు అందుతున్న విషయం పై, కల్తీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు, ఎరువులు క్రిమిసంహారక మందుల లభ్యత, తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశమున్నది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పటిష్ట…

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో మాదకద్రవ్యాలు పట్టివేత

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో భారీగా మాదకద్రవ్యాలు పట్టివేత. దోహ నుండి హైదరాబాద్ వచ్చిన ఓ లేడి ప్యాసింజర్ వద్ద 53 కోట్ల విలువ చేసే హెరాయిన్ గుర్తించిన డీఆర్ఐ అధికారులు. ఈస్ట్ ఆఫ్రికా జాంబియా నుండి భారీ మొత్తం లో మత్తు పదార్ధాలు హైదరాబాద్ కు ఎక్స్ పోర్ట్ అవుతున్నాయనే పక్కా సమాచారం తో శంషాబాద్ లో మాటు వేసిన డీఆర్ఐ అధికారులు. అనుమానం వచ్చి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ లో అడ్డగించిన అధికారుల బృందం. తమదైన స్టైల్‌ లో  విచారణ చేయగా బయట పడ్డ డ్రగ్స్‌ సరఫరా గుట్టు. నిందితురాలు ముకుంబా కరోల్ ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్న డీఆర్ఐ అధికారులు.

జిల్లా దావఖానాల్లో 57 పరీక్షలు ఫ్రీ

రాష్ట్రంలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాలలోని, ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో 19 వైద్య పరీక్ష కేంద్రాలను (డయాగ్నోసిస్ సెంటర్లను) జూన్ 7న ప్రారంభించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మహబూబ్ నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, జనగాం, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సిద్దిపేట, నల్లగొండ, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్, నిర్మల్, కరీంనగర్, అదిలాబాద్, గద్వాల, అసిఫాబాద్ జిల్లాల్లోని ప్రధాన వైద్య కేంద్రాలలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసుకున్న డయాగ్నోసిస్ కేంద్రాలను ప్రారంభించాలని, ఈమేరకు ఇవాళ వైద్య అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ వైద్యారోగ్యశాఖ అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి, రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవల గురించి, పలు అంశాల మీద అధికారులతో సీఎం చర్చించారు. గతంలో సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రంలోని…