ఐకెపి సెంటర్ సందర్శించిన తెలంగాణ జన సమితి నాయకులు

నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం లోని కురుమర్తి గ్రామములో ఉన్న ఐకెపి సెంటర్ ను తెలంగాణ జన సమితి నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మారబోయిన శ్రీధర్ మరియు ఇతరులు సందర్శించారు. రైతులు ధాన్యము తీసుకువచ్చి రెండు నెలలు అవుతున్నప్పటికీ ఇంకా పూర్తిగా కొనుగోలు చేయలేదని ఇప్పటికే రెండు మూడు సార్లు వర్షం పడి ధాన్యపు గింజలు తడిసి మొలకెత్తుతున్న వి అని రైతులు ఆవేదన వెలిబుచ్చారు ప్రభుత్వం తక్షణమే స్పందించి కొనుగోలు చేయాలని తెలంగాణ జన సమితి జిల్లా కమిటీ జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేయడం జరిగింది. రైతులు ఆత్మహత్యకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలి అని జిల్లా అధ్యక్షుడు గోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

Related posts

Leave a Comment