ఐకెపి సెంటర్ సందర్శించిన తెలంగాణ జన సమితి నాయకులు

నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం లోని కురుమర్తి గ్రామములో ఉన్న ఐకెపి సెంటర్ ను తెలంగాణ జన సమితి నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మారబోయిన శ్రీధర్ మరియు ఇతరులు సందర్శించారు. రైతులు ధాన్యము తీసుకువచ్చి రెండు నెలలు అవుతున్నప్పటికీ ఇంకా పూర్తిగా కొనుగోలు చేయలేదని ఇప్పటికే రెండు మూడు సార్లు వర్షం పడి ధాన్యపు గింజలు తడిసి మొలకెత్తుతున్న వి అని రైతులు ఆవేదన వెలిబుచ్చారు ప్రభుత్వం తక్షణమే స్పందించి కొనుగోలు చేయాలని తెలంగాణ జన సమితి జిల్లా కమిటీ జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేయడం జరిగింది. రైతులు ఆత్మహత్యకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలి అని జిల్లా అధ్యక్షుడు గోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

జూన్ 8 న కేబినెట్ సమావేశం

రాష్ట్ర కేబినెట్ సమావేశం, జూన్ 8 న మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు, ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరుగనున్నది. రాష్ట్రంలో వైద్యం, కరోనా స్థితిగతులు, ఇరిగేషన్, రైతుబంధు, వ్యవసాయం పనులు, లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అనే అంశాల మీద కేబినెట్ చర్చించే అవకాశమున్నది. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలో భాగంగా, ప్రాజెక్టుల పనుల పురోగతి, చేపట్టవలసిన చర్యలు, వానాకాలం సాగునీరు, తదితర సంబంధిత అంశాల మీద సమీక్ష జరిగే అవకాశమున్నది. వానాకాలం పంటల సాగు పనులు ప్రారంభమైన నేపథ్యంలో, పంట పెట్టుబడి సాయం రైతుబంధు అందుతున్న విషయం పై, కల్తీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు, ఎరువులు క్రిమిసంహారక మందుల లభ్యత, తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశమున్నది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పటిష్ట…

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో మాదకద్రవ్యాలు పట్టివేత

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో భారీగా మాదకద్రవ్యాలు పట్టివేత. దోహ నుండి హైదరాబాద్ వచ్చిన ఓ లేడి ప్యాసింజర్ వద్ద 53 కోట్ల విలువ చేసే హెరాయిన్ గుర్తించిన డీఆర్ఐ అధికారులు. ఈస్ట్ ఆఫ్రికా జాంబియా నుండి భారీ మొత్తం లో మత్తు పదార్ధాలు హైదరాబాద్ కు ఎక్స్ పోర్ట్ అవుతున్నాయనే పక్కా సమాచారం తో శంషాబాద్ లో మాటు వేసిన డీఆర్ఐ అధికారులు. అనుమానం వచ్చి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ లో అడ్డగించిన అధికారుల బృందం. తమదైన స్టైల్‌ లో  విచారణ చేయగా బయట పడ్డ డ్రగ్స్‌ సరఫరా గుట్టు. నిందితురాలు ముకుంబా కరోల్ ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్న డీఆర్ఐ అధికారులు.