ప్రభుత్యం కోదండరాం కు బేషరతుగా క్షమాపణ చెప్పాలి: పన్నాల

నల్లగొండ: కేంద్ర ప్రభుత్యం తెచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలను, నూతన విద్యుత్ సవరణ బిల్లు రద్దు చేయాలని చేపట్టిన భారత్ బంద్ అన్నీ రాష్టాలలో శాంతియుతంగా జరిగితే తెలంగాణా లో కెసిఆర్ కేంద్ర ప్రభుత్యానికి అనికూలంగా ప్రజాస్వామ్య హక్కులను కాదని బంద్  నిర్యాహిస్తున్న  నాయకులను అణచివేతకు గురిచేస్తూ అరెస్టులు చేశారని తెలంగాణ జన సమితి జిల్లా అద్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి అన్నారు. నిన్నటి ప్రొ.కోదండరాం అరెస్టును ఖండిస్తూ అఖిలపక్ష కమిటీ సబ్యులంతా  తెలంగాణ జన సమితి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారత్ బంద్ లో బాగంగా హయత్ నగర్ బస్సు డిపో ముందు నిరసన తెలుపుటకు వచ్చిన తెలంగాణ జన సమితి వ్యవస్థాపక  అద్యక్షులు ఆచార్య ప్రొ.కోదండరాం పై పోలీసులు అనుచితంగా ప్రవర్తించి కారునుండి దిగకముందే కారునుండి లాగి బలప్రయోగం చేయడం వలన వంటిపై దుస్తులు చిరిగిపోయినాయి, ఇలాంటి అవమాన కరమైన చర్యలకు బాద్యులయిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్యం కోదండరాం కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అఖిలపక్ష కమిటీ ప్రభుత్యాన్ని డిమాండ్ చేసింది, నిరసన హక్కును నిరాకరించే అధికారం ప్రభుత్యానికి అన్నారు. ఈ సమావేశంలో TJS jilla అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూరు సాగర్, ప్రజా సంఘాల ఐక్యవేదిక జిల్లా నాయకులు సుధాకర్ రెడ్డి ఇంటి పార్టీ జిల్లా నాయకులు కొండేటి మురళి తెలంగాణ జన సమితి జిల్లా కార్యదర్శి పులి పాపయ్య, జన సమితి జిల్లా నాయకులు మేకల శివకుమార్ పవన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment