“MOM” కి విశేష స్పందన

ప్రముఖ సంతాన సాఫల్య కేంద్రం MOM IVF హైదరాబాద్ వారు, స్థానిక రాజేశ్వరి హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన సంతాన సాఫల్య ఉచిత వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు.. ఈ వైద్య శిబిరానికి సంతానం లేని దంపతుల నుండి విశేషమైన స్పందన లభించింది, సుదూర ప్రాంతాలనుండి, వేరు,వేరు జిల్లాలనుండి కూడా వచ్చి MOM IVF వారి సేవలు వినియోగించుకున్నారు, అధిక వ్యయంతో కూడుకున్న ఈ వైద్య సేవలు, MOM IVF వారు ఉచితంగా అందించడమే కాకుండా కొంతమందికి మెడిసిన్ కూడా ఉచితంగా ఇచ్చారు.

సంతానం లేని దంపతులు వైద్యుల సూచనలు పాటించి సంతాన సాఫల్యం పొందాలని సంతాన సాఫల్య ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పూర్ణిమ దుర్గ, స్త్రీల వైద్యనిపుణులు డాక్టర్ నీలా రాజేశ్వరి అన్నారు. ఆదివారం స్థానిక రాజేశ్వరి హాస్పిటల్ లో MOM IVF, రాజేశ్వరి హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన సంతాన సాఫల్య ఉచిత వైద్య శిబిరంలో వారు సంతానం కలగని 196 మందికి పరీక్షలు నిర్వహించారు, అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సంతానం లేని దంపతులు గ్రామాల్లో తెలిసి తెలియక నాటు వైద్యం పసరు మందు తాగి తమ ఆరోగ్యాలను పాడు చేసుకోవద్దని వైద్యుల సలహాలు సూచనలు పాటిస్తే సంతాన సాఫల్యం ఉంటుందన్నారు ముందు ముందు నల్లగొండ జిల్లాలో మరిన్ని సంతానసాఫల్య ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు వైద్య శిబిరంలో అవసరమైనవారికి ఉచితంగా మందులు సైతం పంపిణీ చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రాజేశ్వరి హాస్పిటల్ ఎండి నీల గోవర్ధన్ MOM IVF సీఈఓ డాక్టర్ పి. హరి కాంత్ చారి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ స్వప్న డాక్టర్ వరుణ్ సింగ్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment