క్రీడాకారుని కుటుంబానికి చేయూత

శివాజీ క్రికెట్ క్లబ్ మాజీ క్రీడాకారుడు చెన్నుపాటి మాల్యాద్రి అనారోగ్యంతో ఇటీవలప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మరణించాడు. నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు ఆయన కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 4,00,000/-రూపాయలు CMRF చెక్కు ను NG కాలేజి లో N P L క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ సందర్బంగా క్రీడాకారుల సమక్షంలో ఆయన భార్య భాగ్యమ్మకు అందచేశారు. ఈకార్యక్రమంలో…DSP వెంకటేశ్వర్ రెడ్డి..మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు పిల్లి రామ రాజు యాదవ్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, కౌన్సిలర్లు యామాకవిత దయాకర్ బషీరుద్దీన్, వట్టిపల్లి శ్రీనివాస్ ఆలకుంట మోహన్ బాబు, పట్టణ పార్టీ అధికార ప్రతినిధి సంధినేని జనార్దన్ రావు, టిఆర్ఎస్వి వెంకన్న, మామిడి శీను, నాగార్జున ఎన్పిఎల్ ఆర్గనైజర్స్ ముత్తినేని నాగేశ్వరరావు, బోనగిరి ప్రభాకర్, సభ్యులు అంజయ్య గౌడ్, శ్రీధర్ గౌడ్, రమేష్ యాదవ్, మధుకర్, శ్రీనివాసగౌడ్, శ్రీకాంత్, సముద్రాల శంకర్, చిన్ని రంగా తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment