ఆర్టిజన్ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శాంతినగర్ లోని 133/32 కెవి నందు ఆర్టిజన్ సమస్యలు పరిష్కరించాలి టీఎస్ ట్రాన్స్ కో విద్యుత్ సౌధ  డైరెక్టర్ ట్రాన్స్ మిషన్ గారికి న్యూ జె ఎల్ ఎమ్ లు మరియు ఆర్టిజన్ లు   తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ ఎస్ సి & ఎస్టీ ఎంప్లాయిస్ వెల్పేర్ అసోసియేషన్ రూరల్ జోన్ సెక్రటరీ జనరల్ చింత యల్లయ్య అధ్యక్షత న వినతిపత్రం అందజేయడం తో పాటు గజ మాల తో ఘనంగా సన్మానించారు .ఈ కార్యక్రమాని ఉద్దేశించి చింత ఎల్లయ్య మాట్లాడుతూ ఆర్టిజన్ లకు ఏ పీ ఎస్ ఈ బి  రూల్స్ అమలుచేయాలని ,క్వాలిఫికేషన్ బట్టి కన్వర్షన్ చేయాలని ,పర్సనల్ పే ను   బేసిక్ పే లో కలపాలని , సి బి డి గ్యాంగ్ లో ఉన్న ఆర్టిజన్ ల అందరికి గ్రేడ్ -1 సాలరీ ఇప్పించాలని,  2018 సబ్ ఇంజనీర్  నోటిఫికేషన్ కోర్టులో కేసు త్వరితగతిన పూర్తి చేయాలని, 2018 టి ఎస్ ఎస్ పి డి సి ఎల్ లో జూనియర్ అకౌంట్ ఆఫీసర్ ఫలితాలు విడుదల చేయాలని, ఎస్ ఎఫ్ ఎం ఎస్ లో కొన్ని ఇబ్బందులను గురించి రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఆస్పత్రిలో అత్యవసర పరిస్థితుల్లో చికిత్స చేయించుకున్న ఎడల అటు బిల్లును ఆమోదం చేయాలని, సర్వీస్ రిజిస్టర్ ఓపెన్ చేయాలని, కారుణ్య నియామకాలు భర్తీ చేయాలని, 2020లో పెయిడ్ హాలిడేస్ ఇప్పించాలని, ప్రతి సబ్ స్టేషన్లో వాచ్మెన్ నియమించాలని, ట్రాన్స్ఫర్లు చేయాలని ఆర్టిజన్ గా గుర్తింపు పొంది పై చదువులు చదివి ఉన్నవారికి గ్రేడ్   మార్చుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ ట్రాన్స్మిషన్ డైరెక్టర్ కోరడమైనది . కారుణ్య నియామకాల గురించి అతి త్వరలో పరిష్కరిస్తామని టీఎస్ ట్రాన్స్కో విద్యుత్ సౌధ డైరెక్టర్ జగత్ రెడ్డి గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఆర్ జె సిఇ  నాగరాజు గారు నల్లగొండ ఎస్ సి బాలచందర్ గారు  డీఈ లు వెంకటేశ్వర్లు బోసు బాబు మోతీ రామ్ నాయక్ ఏఈ విద్యాధరి  అశోక్ మామిడి సత్యనారాయణ  డాక్టర్ శరత్ చందర్ మేకల బిక్షమయ్య, మంద చిన్నారి ధీరావత్ సుమలత కేసరి లలిత శివాజీ తదితరులు పాల్గొన్నారు

Related posts

Leave a Comment