12th బెటాలియన్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

సామాన్య ప్రజలు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా  రోడ్డు భద్రత నిబంధనల పై అవగాహన కల్పించుకొని జాగ్రత్తగా వాహనాలు నడపాలని నల్లగొండ డి.ఎస్.పి వెంకటేశ్వర్ రెడ్డి  సూచించారు. బుధవారం నల్గొండ పట్టణం సమీపంలోని 12th బెటాలియన్ కమాండెంట్ ఎన్ వి సాంబయ్య ఆధ్వర్యంలో పోలీసులకు  హెల్మెట్, రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 12th బెటాలియన్ నుండి రాంనగర్ ఎం జి యు యూనివర్సిటీ తదితర ప్రాంతాల్లో పోలీసులు బైక్ ర్యాలీ నిర్వహించారు. రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం జరిగిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డిఎస్పి వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ 12th బెటాలియన్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం ముందుగా పోలీసులు పెంచుకోవాలనే ఉద్దేశంతో వారికి అవగాహన కల్పించడం మంచి విషయం అన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం పట్ల బెటాలియన్ కమాండెంట్ సాంబయ్య ను అభినందించారు. పోలీసులు ప్రజలతో మమేకమై రోడ్డు నిబంధనలు వారికి అవగాహన కల్పించాలని సూచించారు. కమాండెంట్ సాంబయ్య మాట్లాడుతూ రోడ్డు భద్రత నిబంధనలపై ముందుగా పోలీసులకు అవగాహన కల్పిస్తే వారు ఆ నిబంధనలు ప్రజల్లోకి తీసుకు వెళ్లి వారికి అవగాహన కల్పిస్తారని ఈ ఉద్దేశంతోనే తాము తమ బెటాలియన్లో రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీఐ శ్రీనివాస్, అడిషనల్ కమాండెంట్ రామకృష్ణ ,అసిస్టెంట్ కమాండెంట్ నర్సింగ్ వెంకన్న లు మాట్లాడుతూ అజాగ్రత్తతో నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురై ప్రాణాపాయం జరగడమే కాకుండా క్షతగాత్రులు అయితే లక్షలు వెచ్చించి వైద్యం చేసుకోవలసిన పరిస్థితి ఉంటుందని అంతేకాకుండా ఆయా వ్యక్తుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఎదురవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన కల్పించుకుని వాహనాలను జాగ్రత్తగా నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ లు అశోక్ కుమార్ ,తిరు పతి 12 thబెటాలియన్ అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Related posts

Leave a Comment