12th బెటాలియన్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

సామాన్య ప్రజలు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా  రోడ్డు భద్రత నిబంధనల పై అవగాహన కల్పించుకొని జాగ్రత్తగా వాహనాలు నడపాలని నల్లగొండ డి.ఎస్.పి వెంకటేశ్వర్ రెడ్డి  సూచించారు. బుధవారం నల్గొండ పట్టణం సమీపంలోని 12th బెటాలియన్ కమాండెంట్ ఎన్ వి సాంబయ్య ఆధ్వర్యంలో పోలీసులకు  హెల్మెట్, రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 12th బెటాలియన్ నుండి రాంనగర్ ఎం జి యు యూనివర్సిటీ తదితర ప్రాంతాల్లో పోలీసులు బైక్ ర్యాలీ నిర్వహించారు. రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం జరిగిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డిఎస్పి వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ 12th బెటాలియన్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం ముందుగా పోలీసులు పెంచుకోవాలనే ఉద్దేశంతో వారికి అవగాహన కల్పించడం మంచి విషయం అన్నారు. ఈ కార్యక్రమం…