కామ్రేడ్ మల్లు స్వరాజ్యం అస్తమయం

భూస్వామి కుటుంబంలో పుట్టినప్పటికీ పేదల కోసమే ఆమె పోరాటం, బానిస సంకెళ్లు తెంపేందుకే చివరి వరకు ఆరాటం, స్వతంత్ర రాజ్యం లో జీవించాలనే ఆకాంక్ష స్వరాజ్యం అనే ఆమె పేరు లోనే ఉన్నది. తెలంగాణ ముద్దుబిడ్డ యెర్ర జెండాకు  అండగా చేరింది, అరుణ పతాకమై రెపరెపలాడింది కామ్రేడ్ మల్లు స్వరాజ్యం.   పేదల జీవితాల్లో వెలుగులు నింపిన నక్షత్రం నింగికెగసింది. తెలంగాణ ప్రజానీకం కన్నీరు కార్చింది. ఇక లేరనే సంగతి ప్రతి వ్యక్తి గుండెను బరువెక్కించింది. భూమికోసం, భుక్తి కోసం, పీడిత వర్గ ప్రజల విముక్తికోసం, పదకొండేళ్ళ వయస్సులోనే పోరు బాట పట్టింది మల్లు స్వరాజ్యం. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, స్వాతంత్ర సమరయోధురాలు మల్లు స్వరాజ్యం ఇక లేరనే సంగతి ప్రతి వ్యక్తి గుండెను బరువెక్కించింది. మహిళల ధైర్యసాహసాలకు ప్రతిరూపకంగా నిలిచిన మల్లు స్వరాజ్యం. సూర్యాపేట…

గురుకుల ప్రవేశాలకు నోటిఫికేషన్

·         ఈ నెల 28 వరకు దరఖాస్తుల స్వీకరణ ·         మే 8 న ఉదయం 11 నుంచి మద్యాహ్నం ఒంటిగంట వరకు 5 వ తరగతి అర్హత పరీక్షా ·         మొత్తం 603 గురుకుల పాఠశాలల్లో 48,280 సీట్లు సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో ఐదోతరగతి ప్రవేశాలకు సంబంధించి VTGCET- 2022 నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (TSWREIS), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (TTWREIS), తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (TREIS), మహాత్మాజ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (MJPTBCWREIS) ల పరిధిలోని 608 గురుకుల పాఠశాలల్లో 48,280 సీట్లను అర్హత పరీక్ష ఆధారంగా భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించినట్లు సెట్ చీఫ్ కన్వీనర్ రోనాల్…