గురుకుల ప్రవేశాలకు నోటిఫికేషన్

 ·         ఈ నెల 28 వరకు దరఖాస్తుల స్వీకరణ 
 ·         మే 8 న ఉదయం 11 నుంచి మద్యాహ్నం ఒంటిగంట వరకు 5 వ తరగతి అర్హత పరీక్షా 
 ·         మొత్తం 603 గురుకుల పాఠశాలల్లో 48,280 సీట్లు  

సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో ఐదోతరగతి ప్రవేశాలకు సంబంధించి VTGCET- 2022 నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (TSWREIS), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (TTWREIS), తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (TREIS), మహాత్మాజ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (MJPTBCWREIS) ల పరిధిలోని 608 గురుకుల పాఠశాలల్లో 48,280 సీట్లను అర్హత పరీక్ష ఆధారంగా భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించినట్లు సెట్ చీఫ్ కన్వీనర్ రోనాల్ రాస్ తెలిపారు. గురుకులాల్లో ప్రవేశాలకు ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 28లోగా ఆన్లైన్ లో రూ.100 ఫీజు చెల్లించి దరఖాస్తు సమర్పించాలని సూచించారు. మే 8న ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 180042545678 నంబర్ లో సంప్రదించాలని లేదా గురుకుల సొసైటీల వెబ్ సైట్ చూడాలన్నారు.

గురుకుల సొసైటీల వెబ్ సైట్ :  https://tgcet.cgg.gov.in

దరఖాస్తు చేయుటకు :  https://tgcet.cgg.gov.in/TSVTGCETAPPLSPR/#!/applicationtgcet20012022.appl

Related posts