ఇండస్ట్రియల్ పార్కును రద్దు చేసుకోవాలి-నూనె వెంకట్ స్వామి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో ప్రభుత్వ,బంజరు, పొరంబోకు,అటవీ,నదీతీర, మిగులు భూములన్నింటిలో భూమిలేని దళితులకు, BCలకు పట్టాలివ్వాలని పోరాడితే.ఈ ఉద్యమంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ప్రభుత్వం వెలిమినేడులోని 300 ఎకరాల పేద అసైన్దారుల భూములను లాక్కోవడం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని అవమానించడమే అవుతుందని జలసాధన సమితి ఆలిండియా అధ్యక్షులు దుచ్చర్ల సత్యనారాయణ అన్నారు. 4వ రోజుకు చేరిన భూ నిర్వాసితుల దీక్షలకు ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసి మాట్లాడారు.
తక్షణం ఇండస్ట్రియల్ పార్కును రద్దు చేసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
PRPS రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి మాట్లాడుతూ”ప్రభుత్వ భూములు మినహా అసైన్డ్ భూముల జోలికి వెళ్ళొద్దని” హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో
BSP నాయకులు గ్యార మారయ్య ప్రతినిధి బృందం, MRPS నాయకులు మేడి శంకర్ లు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ దీక్ష లో
భూపోరాట నాయకులు అంశాల సత్యనారాయణ, గుఱ్ఱం వెంకటేశ్,మేడి యాదయ్య,మెట్టు శ్రీశైలం,మేడి ముత్యాలు,అంశాల శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు

Related posts