బస్సుల ఫిట్నెస్ విషయంలో వెసలుబాటు కల్పించాలి – TRASMA

కరోనా కారణంగా గత మూడు సంవత్సరాలుగా ప్రైవేటు పాఠశాలల యజమానులు ఆర్థికంగా పూర్తిగా నష్టపోయారని ఇలాంటి పరిస్థితులలో బస్సుల ఫిట్నెస్ పేరుతో పన్నులు వసూలు చేయడం సరికాదని, ప్రభుత్వం దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు బస్సుల ఫిట్నెస్ విషయంలో వెసలుబాటు కల్పించాలని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు కందాల పాపిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రైవేటు పాఠశాలల బస్సుల ఫిట్నెస్ పన్ను విషయంలో సడలింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఆర్టిఓ సురేష్ రెడ్డికి ట్రస్మా ఆధ్వర్యంలో బుధవారం వినతి పత్రం అందజేశారు. అనంతరం పాపిరెడ్డి తోపాటు ట్రస్మా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి, ట్రస్మా జిల్లా అధ్యక్షులు కోడి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జి. వి. రావులు మాట్లాడుతూ కరోనా సమయంలో పాఠశాలలకు విద్యార్థులు రాక…

ఇండస్ట్రియల్ పార్కును రద్దు చేసుకోవాలి-నూనె వెంకట్ స్వామి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో ప్రభుత్వ,బంజరు, పొరంబోకు,అటవీ,నదీతీర, మిగులు భూములన్నింటిలో భూమిలేని దళితులకు, BCలకు పట్టాలివ్వాలని పోరాడితే.ఈ ఉద్యమంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ప్రభుత్వం వెలిమినేడులోని 300 ఎకరాల పేద అసైన్దారుల భూములను లాక్కోవడం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని అవమానించడమే అవుతుందని జలసాధన సమితి ఆలిండియా అధ్యక్షులు దుచ్చర్ల సత్యనారాయణ అన్నారు. 4వ రోజుకు చేరిన భూ నిర్వాసితుల దీక్షలకు ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసి మాట్లాడారు.తక్షణం ఇండస్ట్రియల్ పార్కును రద్దు చేసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.PRPS రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి మాట్లాడుతూ”ప్రభుత్వ భూములు మినహా అసైన్డ్ భూముల జోలికి వెళ్ళొద్దని” హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోBSP నాయకులు గ్యార మారయ్య ప్రతినిధి బృందం, MRPS నాయకులు మేడి శంకర్ లు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ దీక్ష లోభూపోరాట నాయకులు అంశాల సత్యనారాయణ,…