బస్సుల ఫిట్నెస్ విషయంలో వెసలుబాటు కల్పించాలి – TRASMA

కరోనా కారణంగా గత మూడు సంవత్సరాలుగా ప్రైవేటు పాఠశాలల యజమానులు ఆర్థికంగా పూర్తిగా నష్టపోయారని ఇలాంటి పరిస్థితులలో బస్సుల ఫిట్నెస్ పేరుతో పన్నులు వసూలు చేయడం సరికాదని, ప్రభుత్వం దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు బస్సుల ఫిట్నెస్ విషయంలో వెసలుబాటు కల్పించాలని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు కందాల పాపిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రైవేటు పాఠశాలల బస్సుల ఫిట్నెస్ పన్ను విషయంలో సడలింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఆర్టిఓ సురేష్ రెడ్డికి ట్రస్మా ఆధ్వర్యంలో బుధవారం వినతి పత్రం అందజేశారు. అనంతరం పాపిరెడ్డి తోపాటు ట్రస్మా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి, ట్రస్మా జిల్లా అధ్యక్షులు కోడి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జి. వి. రావులు మాట్లాడుతూ కరోనా సమయంలో పాఠశాలలకు విద్యార్థులు రాక ఫీజులు సరిగా వసూలు కాక ఆర్థిక ఇబ్బందులుపతున్న ప్రైవేటు యాజమాన్యాలకు ప్రభుత్వం విధించిన బస్సు ఫిట్ నెస్, గ్రీన్ టాక్స్ లు మరింత భారంగా మారిందని పనులలో ఈ సంవత్సరం మినహాయించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఒక బస్సు ఫిట్నెస్ కు 30 వేల నుండి 50 వేల రూపాయల వరకు ఉండగా గ్రీన్ టాక్స్ కు ఆరు వందల రూపాయల వరకు పెంచారని తెలిపారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రికి తమ సమస్యలను విన్నవించగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. బస్సుల టాక్సీ లకు జూలై 1 వరకు సమయం ఇవ్వాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు చెన్నయ్య గౌడ్ , తిరుమల్ రెడ్డి, పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, ప్రతినిధులు ఉన్నారు.

Related posts