కలెక్టర్ల ద్వారానే దళిత బంధు లబ్ధిదారులను ఎంపిక చేయాలి-వంగపల్లి.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ గారు దళితులను అభివృద్ధిలోకి తీసుకురావాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకం నిజమైన అర్హులకు అందాలంటే కలెక్టర్ల ద్వారానే లబ్ధిదారులను ఎంపిక చేయాలని MRPS రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఏ ప్రభుత్వ పథకమైన ఇళ్లులేని,భూమి లేని వారికి చేరినప్పుడే ఆ పథక ప్రయోజనం నెరవేరుతుందనీ అన్నారు.దళిత బంధు పథకం నుండి ఎమ్మెల్యేల ప్రమేయాన్ని తొలగించాలనే కార్యాచరణలో భాగంగా ఈరోజు MRPS నల్గొండ జిల్లా అధ్యక్షులు ముదిగొండ యల్లేష్ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా కలెక్టరేట్ ధర్నాకు ముఖ్య అతిథిగా వంగపల్లి శ్రీనివాస్ గారు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకం ఎమ్మెల్యేల చుట్టూ తిరిగేవాళ్లకే దళిత బంధు పథకం దక్కుతుంది కానీ నిజమైన లబ్ధిదారులకు దక్కడం లేదని ఆవేదన చెందారు.
దళితబంధు పథకం అమలు ఎమ్మెల్యేల చేతిలో ఉండటం వల్ల తమ ఇష్టం వచ్చినట్లు వారి అనుచర వర్గానికే కట్టపెడుతున్నారని అన్నారు,అంతే కాకుండా దళారులు,మధ్యవర్తల ద్వారా ఆర్థికంగా డబ్బులున్న వారినుండి 2 నుండి 4 లక్షలు తీసుకొని వారికే ఇస్తున్నారని నిజమైన అర్హులకు దక్కట్లేదని మా దగ్గర పూర్తి సమాచారం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు,
దళితబంధు పథకానికి మేము వ్యతిరేకం కాదని,ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకం యొక్క లక్ష్యం దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజమైన లబ్ధిదారులను గుర్తించే విధంగా క్షేత్రస్థాయిలో నిజమైన అర్హులను గుర్తించే విధంగా అధికారులకు అప్పగించి జిల్లా కలెక్టర్ ద్వారానే అమలు చేయాలని ప్రభుత్వానికి ఆయన స్పష్టం చేశారు.ఎమ్మెల్యేల ప్రమేయం వల్ల అక్రమాలు జరుగుతున్నాయని కాబట్టి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని తక్షణం దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు,
దలితబందు పథకం నుండి ఎమ్మెల్యే ప్రమేయం తొలగించాలని ఎమ్మార్పీఎస్ ఉద్యమ కార్యాచరణలో భాగంగా నిన్నటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు కొనసాగుతున్నాయని అన్నారు.అదేవిధంగా ఈ నెల 28వ తేదీన లక్ష మందితో ఇందిరా పార్కు దగ్గర మహాధర్నా నిర్వహిస్తామన్నారు. దళితబంధు అమలులో ఎమ్మెల్యేల ప్రమేయం పూర్తిగా తొలగిస్తూ జిల్లా కలెక్టర్ ద్వారానే అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించి క్షేత్రస్థాయి అధికారులకు అప్పగించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున మాదిగల ఆగ్రహానికి గురి కాక తప్పదని అన్నారు.
ఈకార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షడు కత్తుల తులసీదాసు మాదిగ, జాతీయ కార్యదర్శి నకరకంటి అంజయ్య మాదిగ,రాష్ట్ర కార్యదర్శి జన్నపాల రమేష్ మాదిగ,MSF TS నల్లగొండ జిల్లా అధ్యక్షులు మరిపాక నరేందర్ మాదిగ, రాష్ట్ర కార్యదర్శి నుకాపంగ కషయ్య మాదిగ,నాగార్జున సాగర్ ఇంచార్జీ గన్నేపాక లక్ష్మన్ మాదిగ, మిర్యాలగూడ నియోజకవర్గం ఇన్చార్జి రమంజి సైదులు మాదిగ,దేవరకొండ నియోజకర్గం ఇంచార్జీ మద్దిమాడుగు రవి మాదిగ,ఏడుకొండలు అందుగుల సైదులు, పాటల సైదులు,చరణ్ తదతరులు పాల్గొన్నారు.

Related posts