గ్రూప్-1 పరీక్షలను పకడ్బందీగా, సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి-కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా ఈ నెల 16 న నిర్వహించే గ్రూప్-1 పరీక్షలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నందున లైజన్ అధికారులు,సహాయ లైజన్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్ లు, ప్లయింగ్ స్క్వాడ్స్ ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తూ పరీక్షలు పకడ్బందీగా, సజావుగా, ప్రశాంతంగా వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి సూచించారు. బుధవారం గ్రూప్-1 పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో టీఎస్.పిఎస్.సి చైర్మన్ డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరం లో లైజన్ అధికారులు,సహాయ లైజన్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్ లు, ప్లయింగ్ స్క్వాడ్స్ అధికారులు, చీఫ్ సూపెరింటెండెట్లను ఉద్దేశించి మాట్లాడుతూ పరీక్ష ఈ నెల 16న ఉదయం 10. 30 గంటల నుండి మధ్యాన్నం 1. 00 వరకు నిర్వహించే పరీక్షకు జిల్లాలో సుమారు 16084 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని, అందుకనుగుణంగా నల్గొండ పట్టణం లో 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
ప్రభుత్వం మొదటిసారిగా బయోమెట్రిక్ విధానం ద్వారా అభ్యర్థులను నిశితంగా పరిశీలించి పరీక్ష కేంద్రాలకు అనుమతించాలని నిర్ణయించిందని అన్నారు. కాబట్టి అభ్యర్థులను ఉదయం 8. 30 గంటల నుండి పరీక్ష కేంద్రాలకు అనుమతించడం జరుగుతుందని, ఉదయం 10.15 గంటలకు గేట్ లు మూసి వేయడం జరుగుతుందని తెలిపారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, చరవాణిలకు, ఎగ్జామ్ ప్యాడ్ లకు అనుమతి లేదని అన్నారు. అదేవిధంగా షూ వేసుకురావడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకొని హాల్ టికెట్ తో పాటు ఫోటో గుర్తింపుకై ఓటరు కార్డు,ఆధార్, పాన్ కార్డు, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి వెంట తీసుకురావాలని సూచించారు. ఒక వేళ హల్ టికెట్ పై ఫోటో లేకున్నా,సంతకం లేకుంటే. గెజిటెడ్ అధికారి తో అటెస్ట్ చేసిన మూడు పాస్ పోర్ట్ సైజ్ ఫోటో లు,నిర్ణీత ప్రోపార్మా ,అండర్ టేకింగ్ తో పరీక్ష కేంద్రం లో అంద చేయాలని సూచించారు ఆబ్జెక్టివ్ టైపు లో ఉండే పరీక్షకు ఓ. ఏం.ఆర్. షీట్ లో బ్లూ లేదా బ్లాక్ పెన్ తోనే వ్రాయవలసి ఉంటుందన్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించవలసిన గురుతర భాద్యత చీఫ్ సూపరిండెంట్ లదేనని లై జన్ అధికారులతో సమన్వయము చేసుకుంటూ ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. గదిలో కావలసిన ఫర్నీచర్, వెలుతురు ఉండేలా చూడాలని, మంచి నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి కేంద్రంలో ఏ.యన్.ఏం. తో పాటు ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, విద్యుత్ అంతరాయం కలగకుండా విద్యుత్ సరఫరా అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులను సునిశితంగా చెక్ చేసి పంపాలని, ఆ తరువాత బయోమెట్రిక్ ద్వారా చెక్ చేసి హల్ టికెట్ పై హోలోగ్రాం వేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద పొలిసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, జిరాక్స్ కేంద్రాలను మూసివేయించాలని, 144 సెక్షన్ అమలు చేయాలని పొలిసు అధికారులకు సూచించారు.
ఈ సమావేశం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,అదనపు కలెక్టర్ (రెవెన్యూ) భాస్కర్ రావు, అదనపు ఎస్.పి. అశ్వక్ అహ్మద్,మిర్యాలగూడ డి.ఎస్.పి.వెంకటేశ్వర రావు ,సంబంధిత అధీకారులు, చీఫ్ సుపేరింటేడెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts