మునుగోడులో కె సి ఆర్, టి ఆర్ ఎస్ ఓటమి ఖాయం – గోలి ప్రభాకర్

మునుగోడులో కె సి ఆర్, టి ఆర్ ఎస్ ఓటమి ఖాయం అని బీజేపీ ఎస్సీమోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు గోలి ప్రభాకర్ అన్నారు ఆదివారం ఉదయం మునుగోడు మండల పరిధిలోని జమస్థానపల్లి,పులి పలుపుల,కలవలపెల్లి గ్రామాల్లో ఎస్సీ కాలనీలో పర్యటించారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో కలిసి మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన పథకాల్లో అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయన్నారు కేంద్ర మంత్రి వర్గంలో 12 మంది దళితులకు స్తానం కల్పించి దళితులకు పెద్దపీట వేశారు అని చెప్పారు.మునుగోడు లో బీజేపీకి అవకాశం ఇచ్చి గెలిపిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అన్నారు ఇట్టి కార్యక్రమంలో బీజేపీ ఎస్సీమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బాకీ నర్సింహ జిల్లా ఎస్సీమోర్చా ఉపాధ్యక్షుడు సుధాకర్ కార్యదర్శి చేపూరి రాజు బీజేపీ నాయకులు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Related posts