మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో చెక్ పోస్టులను తనిఖీ చేసిన జిల్లా SP రెమా రాజేశ్వరి

ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి అధికారులకు,సిబ్బందికి సూచన.
ముఖ్యమైన జంక్షన్లు మరియు నియోజకవర్గంలోకి ప్రవేశించే ప్రదేశాలలో 
డబ్బు, మధ్యం సరఫరా కాకుండా పటిష్ట నిఘా.

ఉప ఎన్నికల నేపథ్యంలో నేడు మునుగోడు సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గూడపూర్ చెక్ పోస్టును పరిశీలించి, దోమలపల్లి దగ్గర చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలని చండూరు సి. ఐ అశోక్ రెడ్డి,యస్. ఐ సతీష్ రెడ్డి లను ఆదేశించిన జిల్లా యస్.పి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి మద్యం,డబ్బు సరఫరా కాకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయడం జరిగిందనీ, చెక్ పోస్టులను వద్ద నియోజక వర్గంలో కి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీసు బృందాలు ముఖ్యమైన జంక్షన్లు మరియు నియోజకవర్గంలోకి ప్రవేశించే ప్రదేశాలలో ఆశ్చర్యకరమైన డైనమిక్ తనిఖీలను నిర్వహిస్తున్నాయని, మొత్తం 104 గ్రామాలకు గాను క్లస్టర్ ఆఫ్ విలేజ్ గా చేసుకొని ఆ యొక్క గ్రామానికో ఒక యస్. ఐ మరియు 10 మంది సిబ్బందిని నియమించడం జరిగిందినీ,వీరు 24/7 పని చేస్తూ ఎలాంటి సంఘటనలు జరగకుండా నిఘా పెడుతున్నాం అని అన్నారు.

Related posts