లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం- జిల్లా జడ్జి జగ్జీవన్ కుమార్

వివిధ కార్యక్రమాలతో నిత్యం పేద ప్రజలకు పలు కార్యక్రమాల ద్వారా సేవను అందిస్తున్న లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని జిల్లా జిల్లా జడ్జి జగ్జీవన్ కుమార్ అన్నారు. ఈరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారికి నిర్వహించబడుతున్న నిత్య ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం 19 పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు తీసుకొని నిర్ణయం పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు మరియు వారికి సంబంధించిన వారికి ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం ఉన్నదని, ఈ కార్యక్రమానికి సహకరిస్తూ ముందుకు తీసుకెళుతున్న లయన్స్ క్లబ్ సభ్యులకి మరియు నిర్వహించే వారిని అభినందించారు. ఈ రోజు లయన్ గోలి రజినీ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అల్పాహారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ తీగల మోహన్రావు, గోలి అమరేందర్ రెడ్డి, లయన్ సతీష్ కోడి నైతి రఘుపతి మరియు రీసన్ చైర్ పర్సన్లు జోన్ చైర్ పర్సన్లు చార్టెడ్ ప్రెసిడెంట్లు పట్నంలోని వివిధ క్లబ్లో అధ్యక్షులు కార్యదర్శులు కోశాధికారులు నాయకులు మరియు లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Related posts