లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం- జిల్లా జడ్జి జగ్జీవన్ కుమార్

వివిధ కార్యక్రమాలతో నిత్యం పేద ప్రజలకు పలు కార్యక్రమాల ద్వారా సేవను అందిస్తున్న లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని జిల్లా జిల్లా జడ్జి జగ్జీవన్ కుమార్ అన్నారు. ఈరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారికి నిర్వహించబడుతున్న నిత్య ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం 19 పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు తీసుకొని నిర్ణయం పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు మరియు వారికి సంబంధించిన వారికి ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం ఉన్నదని, ఈ కార్యక్రమానికి సహకరిస్తూ ముందుకు తీసుకెళుతున్న లయన్స్ క్లబ్ సభ్యులకి మరియు నిర్వహించే వారిని అభినందించారు. ఈ రోజు…

IMA ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం

హైదరాబాద్ కు చెందిన MNJ కాన్సర్ హాస్పిటల్ మరియు నీలగిరి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ లయన్స్ క్లబ్ఆఫ్ నల్గొండ సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు నిర్ధారణ శిబిరాన్ని పట్టణంలోని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి ప్రాణాంతకం కాదని ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందిస్తే పూర్తిగా నయం చేయవచ్చు అన్నారు. ఈ స్క్రీనింగ్ లో భాగంగా గర్భాశయము, రొమ్ము, గొంతు, మరియు చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్లను గుర్తించవచ్చునని కావున ఈ కార్యక్రమం ఒక సువర్ణ అవకాశమని శిబిరాన్ని వినియోగించుకోవాలని కోరారు, ఈ కార్యక్రమంలో డిప్యూటీ DM&HO వేణుగోపాల్ రెడ్డి, IMA స్టేట్ వైస్ ప్రెసిడెంట్ డా.ACH పుల్లారావు, MNJ కాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ N.జయలత లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షురాలు సత్య శ్రీ, సెక్రెటరీ సుధామునగాల, ట్రెజరర్…

గ్రూప్-1 పరీక్షలను పకడ్బందీగా, సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి-కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా ఈ నెల 16 న నిర్వహించే గ్రూప్-1 పరీక్షలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నందున లైజన్ అధికారులు,సహాయ లైజన్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్ లు, ప్లయింగ్ స్క్వాడ్స్ ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తూ పరీక్షలు పకడ్బందీగా, సజావుగా, ప్రశాంతంగా వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి సూచించారు. బుధవారం గ్రూప్-1 పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో టీఎస్.పిఎస్.సి చైర్మన్ డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరం లో లైజన్ అధికారులు,సహాయ లైజన్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్ లు, ప్లయింగ్ స్క్వాడ్స్ అధికారులు, చీఫ్ సూపెరింటెండెట్లను ఉద్దేశించి మాట్లాడుతూ పరీక్ష ఈ నెల 16న ఉదయం 10. 30 గంటల నుండి మధ్యాన్నం 1. 00 వరకు…