మునుగోడు లో టీఆర్ఎస్ పార్టీలోకి జోరుగా కొనసాగుతున్న వలసలు..

మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ గులాబీ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతోంది. మునుగోడులో కూసుకుంట్ల విజయం ఖాయమనే ధీమాతో ఇతర పార్టీల ప్రజా ప్రతినిదులు టీ. ఆర్. ఎస్ లో చేరుతున్నారు. నేడు( ఆదివారం ) చండూరు మండలం లో జడ్పీటిసి కర్నాటి వెంకటేశం ఆధ్వర్యం లో ఐదు గ్రామాలకు చెందిన సర్పంచ్ లు బిజెపి నీ వీడి మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో లో టీ. ఆర్. ఎస్ లో చేశారు. వీరిలో… చండూర్ మండలం కస్థాల గ్రామ సర్పంచ్ మెండి ద్రౌపతమ్మ వెంకట్ రెడ్డి, నేర్మేట గ్రామ సర్పంచ్ నంది కొండ నర్సిరెడ్డి, గుండ్ర పల్లి సర్పంచ్ తీగల సుభాష్ , దోని పాముల సర్పంచ్ తిప్పర్తి దేవేందర్, తుమ్మల పల్లి గ్రామ సర్పంచ్ కూరపాటి లక్ష్మి సైదులు…

మునుగోడులో కె సి ఆర్, టి ఆర్ ఎస్ ఓటమి ఖాయం – గోలి ప్రభాకర్

మునుగోడులో కె సి ఆర్, టి ఆర్ ఎస్ ఓటమి ఖాయం అని బీజేపీ ఎస్సీమోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు గోలి ప్రభాకర్ అన్నారు ఆదివారం ఉదయం మునుగోడు మండల పరిధిలోని జమస్థానపల్లి,పులి పలుపుల,కలవలపెల్లి గ్రామాల్లో ఎస్సీ కాలనీలో పర్యటించారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో కలిసి మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన పథకాల్లో అన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయన్నారు కేంద్ర మంత్రి వర్గంలో 12 మంది దళితులకు స్తానం కల్పించి దళితులకు పెద్దపీట వేశారు అని చెప్పారు.మునుగోడు లో బీజేపీకి అవకాశం ఇచ్చి గెలిపిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అన్నారు ఇట్టి కార్యక్రమంలో బీజేపీ ఎస్సీమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బాకీ నర్సింహ జిల్లా ఎస్సీమోర్చా ఉపాధ్యక్షుడు సుధాకర్ కార్యదర్శి చేపూరి రాజు బీజేపీ నాయకులు వెంకట్ తదితరులు…