మున్సిపల్ కార్మికులకు పిఆర్సి ఏరియల్స్ బకాయిలు చెల్లించాలి- CITU

                      నల్గొండ మున్సిపాలిటీలో వివిధ విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ,డ్వాక్రా కార్మికులందరికీ పిఆర్సి ఏరియర్స్ ,ప్రభుత్వ సెలవులు అమలు చేయాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) పట్టణ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఎండి సలీం డిమాండ్ చేశారు.               సోమవారం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (CITU) నలగొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేసి అసిస్టెంట్ కమిషనర్ ముసాబు అహ్మద్ కు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ కార్మికుల పోరాట ఫలితంగా ప్రభుత్వం 2021 జూన్ నుండి పిఆర్సి అమలు చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ 2022 జూన్ నుండి నల్గొండ మున్సిపాలిటీలో అమలు జరిగిందని అన్నారు. అందుకు సంబంధించిన సంవత్సరం వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని…